Ragi Malt: మిల్లెట్ లో పుష్కలమైన పోషకాలు ఉంటాయి. వాటిలో ఒకటి రాగులు. రోజూ ఆహారంలో రాగులతో చేసిన ఆహారాలు తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఒకప్పుడు మన పూర్వికులు అన్నానికి బదులుగా రాగి జావను ఆహారంగా తీసుకొని దృఢంగా ఉండేవారు. అంతటి పోషకలు విలువలు కలిగిన రాగి జావను తాగితే ఆరోగ్యానికి కలిగే లాభాలేంటో చూద్దాం..
పుష్కలమైన పోషకాలు
రాగుల్లోనీ విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ , శరీరానికి కావల్సిన శక్తిని అందిస్తాయి. ఇది రోజంతా చురుకుగా, ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
వీటిలోని అధిక ఫైబర్ కంటెంట్ మలబద్దకం, కడుపుబ్బరం, గ్యాస్ వంటి జీర్ణక్రియ సమస్యలను దూరం చేస్తుంది. అలాగే మెరుగైన జీర్ణక్రియకు s
ఎముకల దృఢత్వం
రాగుల్లో పుష్కలమైన క్యాల్షియంతో పాటు ఫాస్పరస్ కూడా ఉంటుంది. వీటిలోని క్యాల్షియం ఎముకలు, దంతాలను దృఢంగా చేస్తాయి. రోజూ ఆహారంలో రాగులతో చేసిన ఆహరం తీసుకుంటే బోలు ఎముకల వ్యాధిని అరికట్టడంలో సహాయపడుతుంది.
యవ్వనంగా ఉంచును
సహజంగా రాగుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్ ఒత్తిడి నుంచి పోరాడి.. వయసు పై బడడాన్ని తగ్గిస్తుంది. దీంతో చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. అంతే కాదు యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
డయాబెటిక్ ఫ్రెండ్లీ
ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవారికి రాగి జావా సరైన ఎంపిక. రోజూ ఆహారంలో రాగి జావా లేదా రొట్టెలు తీసుకోవడం ద్వారా రక్తంలోని చక్కర స్థాయిలు తగ్గించడానికి సహాయపడుతుంది. గోధుమలతో పోలిస్తే రాగులు షుగర్ లెవెల్స్ పెరగడాన్ని నియంత్రిస్తుంది.
పిల్లల ఆరోగ్యానికి మంచిది
చాలా మంది రాగి జావా పిల్లలకు ఇవ్వాలా..? వద్దా అని సందేహపడతారు. ఇది పిల్లలకు కూడా చాలా మంచిది. వీటిలోని పుష్కలమైన పోషకాలు పిల్లలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. 6 నెలల నుంచి పిల్లల ఆహారంలో దీనిని చేర్చవచ్చు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
Also Read : పొట్టలో పేరుకున్న కొవ్వు కరిగిపోవాలా..అయితే కీరా దోసను ఇలా ట్రై చేయాల్సిందే!