Cardamom Health Benefits: సహజంగా మనం రోజు తినే వంటకాల్లో యాలకులు వాడుతుంటాము. మంచి సువాసన కలిగిన దీనిని క్వీన్ ఆఫ్ స్పైసెస్ అని కూడా పిలుస్తారు. సువాసన, రుచితో పాటు యాలకులు తింటే ఆరోగ్యానికి చాలా లాభాలున్నాయి. యాలాకుల్లో విటమిన్స్.. రిబోఫ్లావిన్, నియాసిన్, విటమిన్ C, మినరల్స్ ఐరన్, మాంగనీస్, పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి.
యాలకులు తింటే ఆరోగ్యానికి కలిగే లాభాలు
- రోజూ తీసుకునే ఆహారంలో ఇలాచీ తింటే జీర్ణక్రియను మెరుగుపరిచి.. అజీర్ణత సమస్యను దూరం చేయును. అలాగే జీర్ణక్రియ సమస్యలు కడుపుబ్బరం, యాసిడిటీ సమస్యల నుంచి ఉపశమనం కలిగించును.
- ఇలాచీ నోటి దురువాసనను తొలగించడంలో మంచి చిట్కాల ఉపయోగపడును. దీనిని నోట్లో వేసుకుంటే మౌత్ ఫ్రెష్నర్ లా పని చేసి మంచి ఫీల్ ను కలిగించును.
- యాలకులు మంచి కొవ్వులను కలిగి ఉంటాయి. ఇవి శరీరంలో అధిక కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించడంలో సహాయాడును. అలాగే రక్తపోటు సమస్యను నియంత్రించి గుండె ఆరోగ్యాన్ని కాపాడును.
- ఇలాచీలో యాంటీ ఇన్ఫలమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి శరీరంలో ఏదైనా వాపు, మంటను తగ్గించడంలో సహాయపడును.
- యాలకుల్లో అధిక డైటరీ ఫైబర్ ఉంటుంది. మధుమేహం సమస్య ఉన్న వారికి ఇవి సరైన ఎంపిక. ఇవి రక్తంలోని చక్కర స్థాయిలను నియంత్రించును.
- నీరసం, వాంతులు, మోషన్స్ సమస్య ఉన్న వారికి ఇవి చక్కటి ఉపశమనం కలిగిస్తాయి. అంతే కాదు ఇవి మూత్రాశయ సమస్యలను కూడా తగ్గించడంలో సహాయపడును.
- యాలకుల నుంచి వచ్చే మంచి సువాసన.. ఒత్తిడిని తగ్గించును. అంతే కాదు వీటి సువాసన మైండ్ ను రిఫ్రెష్ చేసి ప్రశాంతంగా ఉండేలా చేస్తాయి.