బెండకాయల తినటం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే..అసలు తినకుండా ఉండలేరు..! బెండకాయలు మీకు ఎంత మేలు చేస్తుందో తెలిస్తే ఇక ముందు తినకుండా ఉండలేరు.బెండకాయలు తినడం వల్ల మీ బ్లడ్ షుగర్ బ్యాలెన్స్ ఉండటమే కాకుండా మీ గుండెను ఫిట్‌గా ఉంచుతుంది. కాబట్టి లేడీఫింగర్ తినడం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం. By Durga Rao 23 May 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి ప్రతి ఒక్కరు బెండకాయలను ఆహారంగా తీసుకోడానికి ఇష్టపడతారు. పిల్లలు బెండకాయలు తినేందుకు మారం చేసినా.. లెక్కలు బాగా వస్తాయని చెప్పి మరీ పెద్దవాళ్లు బలవంతంగా తినిపిస్తుంటారనే సంగతి తెలిసిందే. బెండకాయను ఇంగ్లీషులో ‘ఓక్రా’ (Okra) లేదా లేడీ ఫింగర్ (Lady Finger) అని అంటారు. బెండకాయలను వయస్సు, వ్యాధులతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ తినొచ్చని ఆహార నిపుణులు చెబుతున్నారు. బెండకాయలో సాల్యుబుల్ ఫైబర్స్ సమృద్ధిగా ఉండుట వలన కడుపు నిండిన భావన కలిగి తక్కువ ఆహారాన్ని తీసుకుంటాం. దాంతో బరువు తగ్గుతాం. బరువు తగ్గాలని అనుకొనే వారు బెండకాయను ఆహారంలో భాగంగా చేసుకుంటే చాలా మంచి ఫలితం కలుగుతుంది. బెండకాయలో సమృద్ధిగా ఉండే ప్రోటీన్, ఫైబర్, క్యాల్షియం, ఐరన్, జింక్ వంటి పోషకాలు పోషకాహార లోపం లేకుండా చేస్తాయి.ఈ రోజుల్లో ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్యల్లో పోషకాహార లోపం ఒకటి. శరీరంలో కొలస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. ముఖ్యంగా ట్రై గ్లిజరైడ్లు, చెడు కొలెస్ట్రాల్ లను తగ్గించటంలో బెండకాయ కీలకమైన పాత్రను పోషిస్తుంది. సాధారణంగా బెండకాయల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. విటమిన్లు, మినరల్స్, ఫైబర్‌తోపాటు తక్కువ క్యాలరీలు కలిగిన కూరగాయ ఇది. డయాబెటిస్ బాధితుల్లో ఏర్పడే జీవక్రియ సమస్యలు అంత సులభంగా నయం కావు. అయితే, మంచి జీవనశైలి అలవాట్లతో బ్లడ్ షుగర్ స్థాయిలను నియంత్రణలో పెట్టుకోవడం ద్వారా డయాబెటిస్‌ను అదుపులో ఉంచవచ్చు. సమతుల్య ఆహారం, వ్యాయామం, తగిన విశ్రాంతి ద్వారా డయాబెటిస్‌ను నియంత్రించవచ్చు. శరీరంలో బ్లడ్ షుగర్స్ అదుపులో ఉంటేనే అవయవాలు కూడా దెబ్బతినకుండా సక్రమంగా పనిచేస్తాయి. ఇందుకు బెండకాయ చక్కగా పనిచేస్తుంది. #eat-healthy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి