/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-08T205128.034-jpg.webp)
Mustard oil: ఈ మధ్య కాలంలో చాలా మంది వారు రోజు చేసుకునే వంటకాల్లో సన్ ఫ్లవర్ ఆయిల్, పల్లీ నూనె ఎక్కువగా వాడుతుంటారు. కానీ పూర్వ కాలం నుంచి అందుబాటులో ఉన్న ఆవ నూనెను వాడే వారి సంఖ్య చాలా తక్కువ. ప్రస్తుతం ఉన్న మార్కెట్ లో దీని డిమాండ్ కూడా చాలా తగ్గిపోయింది. కానీ దీని వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. రోజు తినే ఆహారంలో దీన్ని వాడితే ఆరోగ్యానికి చాలా మంచిది. పురాతన వైద్యలో ఆవ నూనెకు చాలా ప్రాముఖ్యత ఉండేది. ఆవ నూనెలో విటమిన్ B కాంప్లెక్, విటమిన్ A, E, కాల్షియం, ప్రోటీన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మం పై ఉన్న గీతలను, ముడతలను, ట్యాన్ తొలంగించి చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తాయి. ఇవి మాత్రమే కాదు ఈ నూనెతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి.
ఆవగింజల నూనె ప్రయోజనాలు
- సహజంగా ఆవాల్లో పుష్కలమైన పోషకాలు ఉంటాయి. కావున దీనిని నుంచి తయారు చేయబడిన నూనెలో కూడా అవే ఉంటాయి. ఆవ నూనెలోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రణలో ఉంచి.. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
- ఆవాలలోని విటమిన్ E, K, A, జింక్, బీటా కెరోటీన్, మెగ్నీషియం వంటి పోషకాల జుట్టు రాలే సమస్యలను దూరం చేస్తాయి. అంతే కాదు చిన్న వయసులోనే గ్రే హెయిర్ సమస్యలు రాకుండా జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది.
Also Read: Tea In Paper Cups: పేపర్ కప్పులో టీ తాగితే ఇంత ప్రమాదమా..! అస్సలు లైట్ తీసుకోకండి
- ఆవ నూనెలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి.. శరీరాన్ని ఇన్ఫెక్షన్స్, జబ్బుల బారి నుంచి రక్షిస్తుంది. అలాగే దీనిలో అధికంగా ఉండే సెలూనియం దగ్గు.. జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యల నుంచి త్వరగా ఉపశమనం కలిగిస్తుంది.
- అధిక బరువు సమస్య ఉన్నవారికి ఇది సరైన ఎంపిక. అలాగే ఇది శరీరంలో అధిక కొవ్వును కరిగిస్తుంది. ఆవ నూనె ఆహారంలో తీసుకుంటే కీళ్ల నొప్పులను కూడా తగ్గించడంలో సహాపడుతుంది.
Also Read: Eating Banana: ఉదయాన్నే బనానా తింటున్నారా.. అయితే ఈ ఆరోగ్య సమస్యలు తప్పవు..!