Pop Corn Health: సినిమా చూస్తూ పాప్ కార్న్ తింటున్నారా .. అయితే ఏమవుతుందో తెలుసా..! సాధారణంగా చాలా మంది ఇంట్లో బోర్ గా ఫీల్ అయినప్పుడు లేదా ఏదైనా మూవీ చూసేటప్పుడు పాప్ కార్న్ తినడానికి ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. ఇది కేవలం సింపుల్ స్నాక్ మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా చాలా లాభాలను ఇస్తుంది. వీటిలోని పోషకాలు జీర్ణక్రియ, బరువు, మధుమేహ సమస్యలను నియంత్రించును. By Archana 07 Dec 2023 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Pop Corn Health: పాప్ కార్న్ అంటే ఇష్టం లేని వాళ్ళు చాలా తక్కువ. మూవీస్, థియేటర్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే స్నాక్ పాప్ కార్న్. ఇది సింపుల్ అండ్ ఈజీ గా చిటికలో చేసుకోవచ్చు. సినిమానే కాదు కొంత మంది ఇంట్లో టీవీ చూస్తూ కూడా పాప్ కార్న్ తినడానికి ఇష్టపడతారు. అందరు పాప్ కార్న్ కేవలం ఒక సింపుల్ స్నాక్ అని మాత్రమే ఫీల్ అవుతారు. కానీ వీటిలో శరీరానికి కావాల్సిన పోషకాహారాలు కూడా ఉంటాయి. పాప్ కార్న్ లోని తక్కువ కేలరీలు, యాంటీ ఆక్సిడెంట్స్, అధిక ఫైబర్, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ జీవన శైలి వ్యాధులను నియంత్రించడంలో సహాయపడతాయి. పాప్ కార్న్ తింటే ఆరోగ్యానికి కలిగే లాభాలేంటో తెలుసుకోండి. పాప్ తింటే కలిగే ఆరోగ్య లాభాలు పాప్ కార్న్ తృణ ధాన్యాలతో చేయబడును. వీటిని మొక్క జొన్నతో తయారు చేస్తారు. సహజంగానే తృణ ధాన్యాలలో ఫైబర్ శాతం ఎక్కువగా ఉండును. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు శరీరంలో కొవ్వును తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడును. ఇది బరువును నియంత్రించడంలో సహాయపడును. వీటిలోని తక్కువ కేలరీలు బరువు తగ్గడంలో సహాయపడును. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్ ఒత్తిడిని తగ్గించును. అలాగే శరీరం రోగాల బారిన పడకుండా కాపాడును. పాప్ కార్న్ లోని అధిక ఫైబర్ కంటెంట్ ఆకలిని పెంచి జీర్ణక్రియను మెరుగుపరుచును. అంతే అన్న వాహిక ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడును. పాప్ కార్న్ లో శరీరానికి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. అంతే కాదు వీటిని డ్రై హీట్ మెథడ్ లో కుక్ చేయడం వల్ల ఆరోగ్యానికి కూడా మంచిది. దీనిలో ఆయిల్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది. మధుమేహం సమస్య ఉన్న వారికి ఈ స్నాక్ సరైన ఎంపిక. వీటిలో తక్కువ గ్లైసెమిక్ వ్యాల్యూ ఉంటుంది. దాని వల్ల రక్తంలోని చక్కర స్థాయిలను తగ్గించడానికి. సహాయపడును. కొన్ని స్నాక్స్ మైదా పిండితో తయారు చేస్తారు. మైదాలోని గ్లూటెన్ కంటెంట్ కొంతమంది అలెర్జీ ని కలిగించును. గ్లూటెన్ అలెర్జీ ఉన్న వారు వీటిని తీసుకుంటే మంచిది. Also Read: Walnut Benifits: మెదడు చురుగ్గా పనిచేయాలంటే.. వీటిని తినండి చాలు..! #health-benefits-of-pop-corn #benefits-of-eating-pop-corn మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి