Palmyra Sprout: తాటి తేగలు తింటే.. ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా..!

తాటి తేగలు తింటే ఆరోగ్యానికి చాలా మేలు. తాటి టెంకలను నుంచి వచ్చే మొలకలనే తాటి తేగలు అంటారు. వీటిలోని పోషకాలు జీర్ణక్రియ, గుండె, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. తేగల్లోని హై ఫైబర్ రక్తంలో షుగర్, కొలెస్ట్రాల్ లెవెల్స్ ను నియంత్రించును. వీటిని కాల్చి లేదా ఉడకబెట్టి తింటారు.

New Update
Palmyra Sprout: తాటి తేగలు తింటే.. ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా..!

Palmyra Sprout: తాటి టెంకలను నుంచి మొలకెత్తిన వాటిని తాటి తెగలు అంటారు. వీటికి చాలా డిమాండ్ ఉంటుంది. ఇవి ఎక్కువగా తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో ఎక్కువగా దొరుకుతాయి. తాటి తెగల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీని గురించి చాలా మందికి తెలియదు. భారతీయులు మర్చిపోతున్న ఆహారాల్లో ఇది ఒకటి. ప్రస్తుతం ఫుడ్ బ్లాగర్స్ ద్వారా వీటి ప్రాముఖ్యత మళ్ళీ పెరుగుతోంది. వీటిలో పుష్కలమైన పోషకాలు ఉంటాయి. మ్యుఖ్యంగా తాటి తెగల్లో ఫైబర్ అధికంగా లభిస్తుంది. వీటిని ఉడకబెట్టి లేదా కాల్చుకొని తింటారు. ఇది తింటే కలిగే మరిన్ని లాభాల గురించి తెలుసుకుందాం..

తేగలు తింటే కలిగే ప్రయోజనాలు 

పుష్కలమైన పోషకాలు

తాటి తెగల్లో విటమిన్ B1,B2, B3, పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం, ప్రోటీన్, ఫైబర్, ఐరన్ ఎక్కువగా ఉంటాయి. వీటిలోని అధిక ప్రోటీన్లు కణజాల పునరుత్పత్తికి, శరీరంలో హార్మోన్స్, ఎంజైమ్స్ నియంత్రించడానికి సహాయపడుతుంది. అలాగే శరీరం బలంగా, దృఢంగా ఉండడానికి తోడ్పడును.

చర్మ ఆరోగ్యానికి మంచిది

వీటిలో యాంటీ ఇన్ఫలమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని నిర్వహించడంలో సహాయపడతాయి. దీనిలోని యాంటీ ఇన్ఫలమేటరీ గుణాలు గాయాలను త్వరగా తగ్గించును. అలాగే చర్మం పై దురద, దద్దుర్లు, ఎరుపు వంటి సమస్యలు నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

publive-image

Also Read: Blood Circulation: రక్త ప్రసరణ మెరుగ్గా జరగాలంటే.. ఈ ఆహారాలు తీసుకోవాల్సిందే

జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరుచును

తాటి తెగల్లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. వీటిని తింటే మలబద్దకం సమస్య ఉన్నవారికి బోవేల్ మూమెంట్ ఫ్రీగా ఉండడానికి సహాయపడుతుంది. అంతే పేగు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. వేసవి కాలంలో వీటిని తింటే శరీరంలో వేడిని తగ్గిస్తుంది. అధిక ఫైబర్ గుణాలు కడుపు నిండుగా ఉందనే భావన కలిగించి.. శరీరంలో కేలరీ కంటెంట్ తగ్గిస్తుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

ఎముకల దృఢత్వం, గుండె ఆరోగ్యాన్ని పెంచును

తేగల్లోని క్యాల్షియం పైబడిన వారిలో ఎముకల దృఢత్వాన్ని పెంచుతుంది. పెద్దవారిలో బోలు ఎముకల వ్యాధి నుంచి కాపాడుతుంది. అంతే కాదు వీటిలోని ఐరన్ కంటెంట్ రక్తంలో హీమోగ్లోబిన్ పెంచడానికి సహాయపడుతుంది. తేగల్లోని మెగ్నీషియం శాతం.. శరీరంలో మంచి కొలెస్ట్రాల్స్ పెంచి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

Also Read: Plastic Water Bottle: ప్లాస్టిక్‌ బాటిల్‌లో నీరు తాగితే మీ పని గోవిందే.. బాంబు పేల్చిన సైంటిస్టులు!

Advertisment
Advertisment
తాజా కథనాలు