Eating Egg: ఉదయాన్నే గుడ్డు తింటున్నారా.. ఇవి తప్పక తెలుసుకోండి..!

సాధారణంగా చాలా మందికి రోజూ ఉదయాన్నే గుడ్డు తినే అలవాటు ఉంటుంది. రోజూ గుడ్డు తింటే ఆరోగ్యానికి చాలా లాభాలు ఉన్నాయి. వీటిలో ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కండరాళ్ళ బలానికి, మెదడు, కంటి ఆరోగ్యానికి సహాయపడును.

New Update
Eating Egg: ఉదయాన్నే గుడ్డు తింటున్నారా.. ఇవి తప్పక తెలుసుకోండి..!

Health Benefits of Eating Egg:  శారీరక శ్రమ, జిమ్, వ్యాయామాలు చేసేవాళ్ళు రోజు ఉదయం వారి డైట్ లో గుడ్డును తీసుకుంటారు. గుడ్డులో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఇది కండరాళ్ళ బలానికి ఉపయోగపడును. అంతే కాదు వీటిలో శరీరానికి కావాల్సిన మినరల్స్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. చాలా మంది గుడ్డు రోజూ తీసుకుంటే మంచిదేనా అని డౌట్ లో ఉంటారు. కానీ గుడ్డు రోజూ తింటే ఆరోగ్యానికి చాలా లాభాలున్నాయి. అలా అతిగా తింటే ఆరోగ్యానికి ప్రమాదం.

ఉదయాన్నే గుడ్డు తింటే ఆరోగ్యానికి కలిగే లాభాలు

పుష్కలమైన పోషకాహారాలు

గుడ్డులో శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. గుడ్డులో ప్రోటీన్ నాణ్యత ఎక్కువగా ఉండును. అంతే కాదు వీటిలో విటమిన్ B12, B6, B2, A, D,E,K అధికంగా ఉంటాయి. ఐరన్, జింక్, ఫాస్ఫరస్, యాంటీ ఆక్సిడెంట్స్ ను కలిగి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా సహాయపడును.

వీటిలో ప్రోటీన్ ఎక్కువ 

గుడ్డులో కణజాలం పెరుగుదలకు, శరీర నిర్వహణకు ఉపయోగపడే 9 రకాల అమైనో యాసిడ్స్ ఉంటాయి. ప్రోటీన్ ఎక్కువగా కావాల్సిన వారికి గుడ్డు సరైన ఎంపిక. వీటిలోని అధిక ప్రోటీన్ ఎక్కువ సమయం వరకు ఆకలిని కలిగించదు.. ఇది బరువును నియంత్రించడంలో తోడ్పడును.

కండరాళ్ళ బలానికి ఉపయోగపడును

ముఖ్యంగా ఉదయాన్నే వ్యాయామం, శారీరక శ్రమ చేసేవాళ్లకు ఇది బెస్ట్ ఛాయిస్. గుడ్డులోని అధిక ప్రోటీన్ కంటెంట్ కండరాళ్ళ పెరుగుదలకు, బలానికి చాల బాగా ఉపయోగపడును.

మెదడు ఆరోగ్యానికి సహాయపడును

గుడ్డులో కోలిన్ అనే న్యూట్రియెంట్ మెదడు ఆరోగ్యం, బ్రెయిన్ పని తీరును మెరుగు పరచడానికి సహాయ పడును. అంతే కాదు ఇది మెదడులోని న్యూరో ట్రాన్స్ మిట్టర్స్ పని తీరుకు సహాయపడడంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచును.

కంటి చూపు ఆరోగ్యాన్ని మెరుగుపరుచును

వీటిలోని ల్యూటిన్, యాంటీ ఆక్సిడెంట్స్, Zeaxanthin పోషకాలు వయసు సంబంధిత కంటి చూపు సమస్యలను దూరం చేయును. అలాగే స్పష్టమైన కంటి చూపుకు ఉపయోగపడును.

పోషకాల శోషణకు సహాయపడును

గుడ్డులోని పచ్చ సొనలో ఆరోగ్యకరమైన ఫ్యాట్ సోలబుల్ కొవ్వులు A, D,E,K ఉంటాయి. ఇవి శరీరంలో పోషకాల శోషణకు బాగా తోడ్పడును.

Also Read: fenugreek seed water: మెంతి నీళ్లను తాగితే.. ఏమవుతుందో తెలుసా..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు