fenugreek seed water: మెంతులను మనం తినే ఆహారంలో ఒక మసాలా దినుసులుగా వాడుతుంటాము. అంతే కాదు మెంతి ఆకులను.. ఆకుకూర చేసుకోవడానికి ఉపయోగిస్తారు. అలాగే మెంతి పొడిని ఊరగాయలు నిల్వ ఉండడానికి ఒక ప్రెసర్వేటివ్ గా వాడతాము. మెంతులను రకరకాలుగా ఉపయోగిస్తారు. ఇవి ఆరోగ్యం పై కూడా మంచి ప్రభావాన్ని చూపుతాయి. ముఖ్యంగా రోజు ఉదయాన్నే మెంతి నీటిని తాగితే శరీరానికి ఎన్నో రకాల లాభాలను చేకూర్చును.
మెంతి నీళ్లు తాగితే ఆరోగ్యానికి కలిగే లాభాలు
శరీరంలో చక్కర స్థాయిలను నియంత్రించును
మధుమేహం సమస్య ఉన్న వారు ఉదయాన్నే మెంతి నీటిని తాగడం ఒక మంచి ఎంపిక. డయాబెటీస్ ఉన్న వాళ్లలో మెంతి నీళ్లు రక్తంలోని చక్కర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడును.
జీర్ణక్రియకు తోడ్పడును
మెంతుల్లోని సోలబుల్ ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడును.
పాలిచ్చే తల్లుల్లో పాల ఉత్పత్తిని పెంచును
ల్యాక్టేటింగ్ మదర్స్ మెంతులను ఎక్కువగా తీసుకుంటారు. ఇవి పాలిచ్చే తల్లుల్లో పాల ఉత్పత్తిని మెరుగుపరచడంలో సహాయపడును.
గుండె ఆరోగ్యాన్ని కాపాడును
మెంతులు రక్తంలోని కొవ్వులను తగ్గించి.. గుండె సంబంధిత సమస్యలు రాకుండా కాపాడడంలో మంచి ప్రభావం చూపును.
ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడును
మెంతుల్లోని యాంటీ ఇన్ఫలమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు ఇన్ఫెక్షన్స్, వాపు వంటి సమస్యలను దూరం చేయును.
ప్రకాశవంతమైన చర్మం
వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు ఆరోగ్యమైన చర్మానికి ఉపయోగపడును. అలాగే చర్మం క్లియర్ గా ప్రకాశవంతంగా కనిపించును.
- మీ ఆహారంలో ఏవైన కొత్త అలవాట్లను చేర్చేటప్పుడు మీ శరీర సున్నితత్వాన్ని, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. అలాగే వైద్యులను సంప్రదించి మాత్రమే వాటిని తీసుకోవాలి.
Also Read: Moog Dal Benefits: బ్లడ్ తక్కువగా ఉంటే ఈ పప్పును తిని చూడండి