Curd Health: పెరుగు ప్రతీ ఇంట్లో సహజంగా కనిపించే ఆహార పదార్థం. చాలా మందికి భోజనం చివరిలో పెరుగు తినే అలవాటు కూడా ఉంటుంది. ఇది తింటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పెరుగులో కాల్షియం, మెగ్నీషియం, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చాలా రకాల సమస్యలను దూరం చేయడంలో సహాయపడును.
పెరుగు తింటే కలిగే ప్రయోజనాలు
ఆరోగ్యకరమైన జీర్ణక్రియ
పెరుగు మంచి ప్రోబాయోటిక్ గా పనిచేస్తుంది. దీనిలో ఉండే ఆరోగ్యమైన బ్యాక్టీరియ జీర్ణాశయంలోని వ్యర్థాలను శుభ్రం చేస్తుంది. ఇది జీర్ణక్రియ పనితీరును మెరుగుపరిచి జీర్ణ సమస్యలను తగ్గించును దూరం చేయును.
రోగ నిరోధక శక్తిని పెంచును
పెరుగులో ఉండే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా ఆరోగ్యాన్ని మెరగుపరుచును. అంతే కాదు రోగ నిరోధక శక్తిని పెంచి శరీరం వ్యాధుల బారిన పడకుండ కాపాడును.
ఎముకల దృఢత్వానికి సహయపడును
దీనిలోని కాల్షియం, ఫాస్ఫరస్ వంటి పోషకాలు ఎముకల బలంగా ఉండడానికి సహాయపడతాయి. ప్రతీ రోజు మనం తినే ఆహారంలో పెరుగు తీసుకుంటే ఆరోగ్యం పై మంచి ప్రభావం చూపుతుంది. అంతే శరీరంలో అధిక ఉష్ణోగ్రత, వేడిని తగ్గించును.
బరువు తగ్గడంలో సహాయపడును
పెరుగు శరీరంలో ఊబకాయం, రక్తపోటుకు కారణమయ్యే కార్టిసాల్ పెరుగుదలను నియంత్రించును. ప్రతీ రోజు ఆహారంలో పెరుగు తీసుకుంటే కొంత వరకు బరువు తగ్గడానికి సహాయపడును.
ముఖం పై ముడతలను తగ్గించును
పెరుగు ముఖ సౌందర్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడును. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు మొహం ముడతలు, పొడి బారడం సమస్యలను తగ్గించును. చర్మాన్ని ఎల్లప్పుడూ హైడ్రేటింగ్ గా ఉంచును.
Beetroot Benefits: డయాబెటిక్ రోగులకు బీట్‌రూట్‌తో చాలా ప్రయోజనాలు.. అవేంటో తెలుసా..? - Rtvlive.com