Health Tips: ఈ పండు తింటే..ఆరోగ్యానికి ఇన్ని లాభాలా..!

అరటిపండు చాలా ఈజీ గా తక్కువ ఖర్చులో దొరుకుతుంది. కానీ ఈ పండులోని విటమిన్స్, మినరల్స్ జీర్ణక్రియ.. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు దీనిలోని అధిక కార్బో హైడ్రేట్స్ శరీరానికి శక్తిని అందిస్తాయి.

New Update
Health Tips: ఈ పండు తింటే..ఆరోగ్యానికి ఇన్ని లాభాలా..!

Health Tips: మన  తినే ఆహారంలో రోజుకు కనీసం ఒక్క పండైన తీసుకునేలా మన డైట్ ప్లాన్ చేసుకోవాలి.  పండ్లను తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు.  పండ్లలోని విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడతాయి.  పండ్లల్లో చాలా మంది ఎక్కువగా అరటిపండు తింటుంటారు.. ఇది తక్కువ ఖర్చుతో ఆరోగ్యానికి ఎక్కువ లాభాలను అందిస్తుంది. అసలు అరటిపండు తింటే కలిగే లాభాలేంటో చూడండి.

అరటి పండు తింటే కలిగే లాభాలు..

పుష్కలమైన పోషక విలువలు

అరటి పండులో పొటాషియం, విటమిన్ C, B6, ఫైబర్ వంటి పోషకాలను కలిగి ఉంటుంది. దీనిలోని విటమిన్స్, మినరల్స్ వంటి పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. విటమిన్ C రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

publive-image

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

అరటి పండులోని ఫైబర్ గుణాలు మలబద్దకం సమస్యను దూరం చేయడంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే దీనిలోని ప్రీ బయోటిక్ గుణాలు జీర్ణక్రియ ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయి.

publive-image

గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది

ఈ పండులో తక్కువ సోడియం.. ఎక్కువ పొటాషియం శాతం ఉండడం వల్ల గుండె ఆరోగ్యానికి  చాలా మంచింది. అరటిపండులోని పొటాషియం రక్తపోటును నియంత్రించి.. గుండె పోటు, గుండె సంబంధిత వ్యాధుల నుంచి కాపాడుతుంది.

publive-image

శక్తిని అందిస్తుంది

దీనిలో అధికంగా ఉండే కార్బో హైడ్రేట్స్ శరీరానికి ఎక్కువ శక్తిని ఇస్తాయి. చాలా మంది వర్క్ ఔట్స్ చేసే ముందు అధిక  శక్తి కోసం బనాన మిల్క్ షేక్ లేదా  అరటి పండును తీసుకుంటారు. అంతే కాదు ఇది చర్మ సౌందర్యానికి కూడా చాలా ఉపయోగపడుతుంది.

publive-image

Also Read: Mental Health: మీ పిల్లలు ఇలా చేస్తున్నారా..? వెంటనే డాక్టర్ ను సంప్రదించండి..!

Advertisment
తాజా కథనాలు