Drumstick Leaf: మునగాకు తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

మునగాకులో ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా వున్నాయి. అలాగే మునగ నూనె కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. రోజూవారీ డైట్‌లో మునగ నూనెను వాడటం ద్వారా మధుమేహం తొలగిపోతుంది.

New Update
Drumstick Leaf: మునగాకు తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

Drumstick Leaf: మరిగే నీటిలో గుప్పెడు మునగాకులు వేసి గట్టిగా మూతపెట్టి 5 నిమిషాలు ఉంచిన తరువాత ఆ పాత్రను చన్నీటిలో పెట్టి బాగా చల్లార్చి పాత్రలోని మునగాకు తీసివేసి మిగిలిన రసములో కొద్దిగా మిరియాలపొడి తగినంత ఉప్పు, 1 చెంచా నిమ్మరసం వేసి ప్రతిరోజూ ఉదయం సేవిస్తూ ఉంటే అజీర్తి, ఉబ్బసం, రక్తహీనత, మామూలు జలుబు, దగ్గు, నిస్సత్తువ వంటివి దరిచేరవు.

ఒక కప్పు మునగాకు రసము బాగా వేడిచేసి చల్లార్చి పైపై నీటిని వంచేసి మిగిలిన పదార్ధములో పాలుపోసి కలిపి ఆ మిశ్రమాన్ని గర్భిణీలు గర్భము ధరించిన నాటినుండి తీసుకొనుచున్న పిండము చక్కగా పెరుగుటయే కాక సుఖప్రసవం అవుతుంది.

మునగలో ప్రోటీన్లు పుష్కలంగా వుండటంతో శరీరానికి బలం చేకూరుతుంది. సాధారణంగా మెరిసే చర్మాన్ని పొందాలంటే.. యాంటీ-యాక్సిడెంట్లు, యాంటీ- ఏజింగ్ గుణాలున్న మునగ నూనెను వాడటం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మునగ నూనె(Drumstick Leaf Oil) రక్తాన్ని శుభ్రపరుస్తుంది.
ఈ నూనెను వాడితే చర్మ సమస్యలుండవు. జుట్టు నెరవదు. కేశాలకు బలం చేకూరుతుంది. రోజూ మనం వాడే నూనెల్లో రెండు స్పూన్ల మేర మునగ నూనెను చేర్చి వాడితే.. ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఇంకా కేశాలకు చుక్కల పరిమాణంలో ఈ నూనెను వాడినా మంచి ఫలితం వుంటుంది. తల మాడుకు ఈ నూనెను రాయడం ద్వారా హెయిర్ ఫాల్ తగ్గుతుంది.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు