Banana Peel: అరటిపండు మాత్రమే కాదు దాని తొక్కతో కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అరటి తొక్కతో చేసిన టీ తాగితే శరీరానికి ఎంతో మేలు చేకూరుతుంది. దీనిలోని పొటాషియం, విటమిన్ B6, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, కాపర్ పోషకాలు గుండె, కండరాళ్ళు , జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
అరటిపండు తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి అందరికీ తెలుసు. అయితే అందరు దాని తొక్కను పనికిరానిదిగా భావించి పారవేస్తారు. కానీ ఈ తొక్కలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఇది అనేక ప్రయోజనాలను కలిగి ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు మీరు ఈ తొక్కలను పనికిరానివిగా భావించి వాటిని పాడేసినట్లైతే .. ఇప్పుడు వాటి ప్రయోజనాలను తెలుసుకోండి.
అరటిపండు తొక్క టీ
వేడినీటిలో అరటి తొక్క వేసి ఉడికించాలి. ఉడికించిన తర్వాత ఈ నీరు సగానికి తగ్గినప్పుడు, దానిని ఫిల్టర్ చేయండి. కావాలంటే దీంట్లో కొద్దిగా దాల్చిన చెక్క, తేనె కలిపితే టీ రుచిని పెంచుకోవచ్చు.
అరటి తొక్కలో పుష్కలమైన పోషకాలు
ఇందులో విటమిన్ B6, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, కాపర్ ఉన్నాయి. పొటాషియం , మెగ్నీషియం కారణంగా, ఈ టీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, నిద్ర నాణ్యతకు సహాయపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ B6 రోగనిరోధక వ్యవస్థ, ఎర్ర రక్త కణాలను అభివృద్ధి చేయడంలో కూడా తోడ్పడుతుంది.
అరటిపండు టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు
అరటిపండు తొక్కతో చేసిన టీ లో పొటాషియం ఎక్కువగా
ఉంటుంది. ఇది శరీరంలో ఫ్లూయిడ్ నిర్వహణకు సహాయపడుతుంది. దీని కారణంగా రక్తపోటు అదుపులో ఉంటుంది. కండరాలలో నొప్పి ఒత్తిడి వంటి సమస్యలు తలెత్తవు. అరటి తొక్కలో ఉండే పొటాషియం, నీరు అధిక సోడియం జీర్ణక్రియ ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
మంచి నిద్ర పొందడానికి
అరటి తొక్క టీ మంచి నిద్ర పొందడానికి సహాయపడుతుంది. ఇది నిద్ర మాత్రల కంటే మంచిది. అరటిపండు టీలో ఉండే పొటాషియం, మెగ్నీషియం, ట్రిప్టోఫాన్ నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తాయి. తద్వారా వేగంగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.
ఈ టీ గుండె ఆరోగ్యానికి మంచిది
అరటిపండు తొక్క టీ తాగితే అందులో ఉండే మూలకాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. రక్తపోటును తగ్గించి.. హార్ట్ స్ట్రోక్ వంటి సమస్యలను నివారిస్తుంది.
కండరాల నొప్పి నుంచి ఉపశమనం
పీల్ టీలో మెగ్నీషియం, కాల్షియం అధికంగా ఉండటం వల్ల, దీనిని తాగినప్పుడు కండరాలు రిలాక్స్ అవుతాయి. ఇది నొప్పి నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.