ప్రతి ఇంటి వంట గదిలో పోపుల డబ్బాలో కచ్చితంగా ఉండే సుగంధ ద్రవ్యాల్లో ఒకటి యాలకులు(Cardmom). యాలకులను ఎక్కువగా స్వీట్స్, బిర్యానీ వంటి వాటిలో ఉపయోగిస్తుంటారు. యాలకులను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలన్నాయంటున్నారు ఆయుర్వేద నిపుణులు.
ఏదైనా ఆహారం తీసుకున్నప్పుడు అది త్వరగా జీర్ణం కావాలంటే నోట్లో నాలుగు యాలకులు వేసుకుంటే..మన జీర్ణ వ్యవస్థ త్వరగా పనిచేయాడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలానే క్యాన్సర్ వంటి రోగాలను దరికి రానీయకుండా యాలకులు బాగా పనిచేస్తాయి.
డిప్రెషన్ వంటి సమస్యలను దరికి రానీయకుండా కాపాడతాయి. డిప్రెషనత్ బాధపడే వాళ్లు పాలలో కొద్దిగా యాలకులు వేసుకుని తీసుకుంటే అద్భుతమైన లాభాలను చూడవచ్చు. యాలకులు మెటాబాలిజాన్ని మెరుగుపరుస్తాయి. యాలకులు తీసుకుంటే కడుపులో మంట, నొప్పి వంటివి తగ్గుతాయి.
యాలకులను తీసుకోవడంలో సంతాన సాఫల్యతను పెంచడంలో బాగా సాయపడతాయి. పురుషుల్లో నరాల పటిష్టతకు యాలకులు ఎంతగానో ఉపయోగపడతాయి. యాలకుల పొడి పాలల్లో వేసుకుని తీసుకుంటే సంతాన భాగ్యం కలుగుతుంది. అలానే జలుబు, దగ్గు, కఫం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు వంటివి ఉన్నప్పటికీ యాలకులు సహాయ పడతాయి.
ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి సమస్యలు ఉంటే ఆకుపచ్చ యాలకులు తీసుకుంటే మంచి మేలు జరుగుతుంది. యాలకుల వల్ల డయాబెటిస్ వంటి వాటి నుంచి కూడా తప్పించుకోవచ్చు. బీపీని కంట్రోల్ చేయడానికి కూడా యాలకులు బాగా ఉపయోగపడతాయి. ఎక్కువగా టెన్షన్ గా ఉన్నప్పుడు రెండు యాలకులు తీసకుంటే ఒత్తిడి బాగా తగ్గుతుంది.
గుండె సమస్యలను తొలగించడంలో యాలకులు బాగా మేలు చేస్తాయి. కొలెస్ట్రాల్ లెవెల్స్ ను కూడా కంట్రోల్ లో ఉంచుతాయి. ఇలా ఒకటి కాదు రెండు కాదు యాలకులు ఎన్నో లాభాలు పొందవచ్చు. పాలీడిప్సియా సమస్యతో బాధ పడే వాళ్లకి యాలకులు మంచి మేలు చేస్తుంది. దాహం ఎక్కువగా వస్తున్న సమయంలో యాలకులు తీసుకుంటే మంచింది. మంచి మౌత్ ఫ్రెషనర్ కింద కూడా యాలకులు పని చేస్తాయి.