coconut water: వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు తెలుసా!

New Update
coconut water: వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు తెలుసా!

ఎండల తీవ్రత బాగా పెరిగింది. బయటకు వెళ్లే వారు ఎండ నుంచి ఉపశమనం కోసం రకరకాల కూల్ డ్రింక్స్‌, ఇతర పానీయాలు తాగుతుంటారు.వీటి కంటే కాస్త ధర ఎక్కువైనా కొబ్బరి నీటిని తాగడం చాలా మంచిది. కొబ్బరి నీరు మంచి హైడ్రేషన్‌ డ్రింక్. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. దీనిలో తక్కువ కేలరీలు, తక్కువ చక్కెర, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కొబ్బరి నీళ్లలో చర్మ ఆరోగ్యానికి అవసరమైన సి,ఈ విటమిన్లు చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. కొబ్బరి నీళ్లను సరిపడినంత తీసుకుంటే కిడ్నీలో రాళ్లు రాకుండా చేస్తాయి.

ఇవే కొబ్బరి నీళ్లలో ఉండే పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపర్చడంలో సాయపడుతుంది. చర్మంపై ఫైన్‌ లైన్స్‌, ముడతలు రాకుండా చేస్తుంది. కొబ్బరి నీటిలో ఉండే పోటాషియం, సోడియం, మెగ్నీషియం శరీరంలో ద్రవ సమతుల్యతను నియంత్రిస్తాయి. అధిక రక్తపోటు ఉన్న వారికి కొబ్బరి నీరు ప్రయోజనకరం. భోజనం చేసిన రెండు నుంచి మూడు గంటల తర్వాత కొబ్బరి నీరు తాగితే పోషకాల శోషణ మెరుగుపడుతుంది. కొబ్బరి నీరు అతిగా తాగితే విరేచనాల సమస్య తలెత్తే అవకాశం ఉంది. మితంగానే తాగాలి.

ఇంట్లో ఎక్కువగా వేడి చేసినట్టు అనిపిస్తే కొబ్బరి నీళ్లను ఉదయాన్నే పరగడుపున తాగితే చలువ చేస్తుంది. శరీరానికి సాంత్వన లభిస్తుంది.భోజనం చేసిన కాసేపటికే తాగితే ఆహారం మెరుగ్గా జీర్ణమవుతుంది. పొట్ట ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. - నిద్రపోయే ముందు తాగితే ఆందోళన, ఒత్తిడి తగ్గి మెదడు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు కూడా బయటకు వెళ్లిపోతాయి. - క్రీడాకారులు ప్రాక్టీస్‌ సమయంలో ఎనర్జీ డ్రింక్స్‌కు బదులు కొబ్బరి నీళ్లు తాగితే తిరిగి శక్తిని పొందవచ్చు. - కొబ్బరి నీళ్లను తాగితే పిల్లల్లో మానసిక, శారీరక ఎదుగుదల బాగుంటుంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు