/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/mahila-1-jpg.webp)
పెళ్ళి కాలేదని నమ్మించి ఓ మహిళను రెండవ పెళ్ళి చేసుకున్నాడు ఓ వ్యక్తి. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం కరుగోరుమిల్లి గ్రామానికి చెందిన గూడూరి పెద్దిరాజు కువైట్ లో పనిచేస్తున్నాడు. అయితే, అక్కడే పనిచేస్తున్న చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికు చెందిన వెంకటలక్ష్మి అతడికి పరిచయం అయింది. దీంతో, తనకు పెళ్లి కాలేదని మాయ మాటలు చెప్పాడు. కువైట్ లోనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు.
కొని నెలల వరకూ ఈ ఇద్దరూ బాగానే ఉన్నారు. అయితే, ఈ ఏడాది జనవరిలో స్వగ్రామంకు వచ్చి లారీ కొనుగోలు చేశాడు పెద్దిరాజు. దీంతో, వీరిద్దరి మధ్య దూరం పెరిగింది. ఈ క్రమంలో కువైట్లో వుంటున్న మహిళను పాలకొల్లు తీసుకొచ్చి వేరే కాపురం పెట్టాడు పెద్దిరాజు. కాగా, గత కొన్ని రోజుల నుంచి ఆమెపై మొహం చాటేశాడు. అతడి ప్రవర్తనపై ఆమెకు అనుమానం వచ్చింది. అతడి గురించి ఆరా తీసింది వెంకటలక్ష్మీ.
Also read: విశాఖ ఘటన..స్కూల్ ఆటోలపై ఆర్టీవో అధికారులతో కలిసి RTV స్పెషల్ డ్రైవ్.!
దీంతో అతడి గురించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పెద్దిరాజుకు గతంలోనే పెళ్లి జరిగిందని తెలిసి షాక్ అయింది. పెద్దిరాజు చేతిలో మోస పోయిన వెంకటలక్ష్మి న్యాయం కోసం పోలీసుల ఆశ్రయించింది. అయితే, పోలీసుల నుండి తనకు ఏ న్యాయం జరగలేదు. దీంతో పెద్దిరాజు ఇంటి ముందు న్యాయ పోరాటంకు దిగింది. ఘటనపై సమాచారం అందుకున్న మీడియా ప్రతినిధులు అక్కడి వెళ్లారు. పెద్దిరాజు నమ్మించి మోసం చేశాడని తన వద్ద నుండి రూ.19 లక్షలు పైగా వాడుకున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం కావాలని డిమాండ్ చేసింది.