Urination case: నాపై మూత్రం పోసిన అతన్ని విడిచిపెట్టండి.. మధ్యప్రదేశ్ ఘటనలో షాకింగ్ ట్విస్ట్..! మధ్యప్రదేశ్ మూత్రం కేసు ఘటనలో మరో ట్విస్ట్. నిందితుడు ప్రవేశ్ శుక్లాను విడిచిపెట్టాలని బాధితుడు రావత్ కోరడం సంచలనంగా మారింది. ప్రవేశ్ తన తప్పును తెలుసుకున్నాడని..అందుకే వదిలిపెట్టాలని రావత్ కోరాడు. By Trinath 08 Jul 2023 in నేషనల్ Scrolling New Update షేర్ చేయండి మధ్యప్రదేశ్ రాజకీయాలు మూత్రం కేసు చుట్టూ తిరుగుతున్నాయి. గిరిజన కూలీ దాస్మేష్ రావత్‌పై ప్రవేష్ శుక్లా అనే వ్యక్తి మద్యం మత్తులో ముఖంపై మూత్రం పోయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రవేశ్ శుక్లా ఓ బీజేపీ ఎమ్మెల్యే సన్నిహితుడిగా ప్రచారం జరగడం.. ఘటనపై సీఎం శివరాజ్‌సింగ్ చౌహన్ స్పందించడం.. నిందితుడు అరెస్ట్ కావడం చకాచకా జరిగిపోయాయి. ఆ తర్వాత రావత్ ఇంటికి వెళ్లిన చౌహన్ బాధితుడి కాళ్లు కడిగారు. ఇదంతా పొలిటికల్ స్టంట్ అని ఓవైపు కాంగ్రెస్ మండిపడుతుండగా.. బాధితుడు రావత్ తాజాగా ట్విస్ట్ ఇచ్చారు. ప్రవేశ్ శుక్లాని విడిచిపెట్టాలని.. అతను తన తప్పు తెలుసుకున్నాడంటూ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మొదటి నుంచే రాజకీయ రంగు: నిజానికి ఈ వీడియో వెలుగులోకి వచ్చిన క్షణం నుంచే ఈ ఘటన చుట్టూ రాజకీయం మొదలయ్యింది. ప్రవేశ్ శుక్లా తమ వాడు కాదు అని బీజేపీ పదేపదే చెప్పుకునే ప్రయత్నం చేయగా.. కాంగ్రెస్ మాత్రం అతను ముమ్మాటికి ఎమ్మెల్యే కేదార్ నాథ్ శుక్లా మనిషేనంటోంది. ప్రవేశ్‌తో కేదార్ నాథ్, మరో ఎమ్మెల్యే రాజేంద్ర శుక్లా దిగిన ఫోటోలు కూడా బయటపడడంతో బీజేపీ ఇరకాటంలో పడింది. అందుకే ఆఘమెఘాలపై చౌహన్ స్పందిచారని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. బాధితుడి కాళ్లు కడగడం కూడా ఎలక్షన్ స్టంట్ అని వాదిస్తోంది. 2018 మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గిరిజన అసెంబ్లీ సీట్లలో బీజేపీ ఘోరంగా ఓడిపోవడాన్ని హైలెట్ చేస్తున్నారు ప్రతిపక్ష నేతలు. ఈసారి అలా జరగకుండా ఉండటానికి చౌహన్ కాళ్లు కడుగుడు డ్రామాకు తెరతీశారంటున్నారు. గిరిజనులపై జరుగుతున్న దాడుల్లో మధ్యప్రదేశ్ దేశంలోనే మొదటిస్థానంలో ఉందని గుర్తుచేస్తున్నారు. గిరిజనుడుపై మూత్రం పోస్టున్న ప్రవేశ్( లెఫ్ట్), గిరిజనుడు కాళ్లు కడుగుతున్న చౌహన్( రైట్) చెప్పాడా.. చెప్పించారా..? రావత్ ముఖంపై ప్రవేశ్ మూత్రం పోసే వీడియో బయటకు వచ్చిన సోషల్‌మీడియా మొత్తం బాధితుడి పక్షానే నిలిచింది. బీజేపీ కార్యకర్తలు సైతం ప్రవేశ్ చర్యను తిట్టిపోశారు. అయితే రావత్, అతని కుటుంబం మాత్రం ఈ కేసు విషయంలో మొదటి నుంచి గందరగోళ సమాధానాలు చెబుతూ వస్తోంది. ఆ వీడియో ఫేక్ అని అతడు ఏకంగా పోలీసులకే చెప్పడంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రవేష్ శుక్లాను ఈ కేసులో ఇరికించేందుకు ఈ వీడియోను క్రియేట్ చేశారని రావత్ చెప్పాడు. అటు రావత్ కుటుంబసభ్యులు సైతం మీడియాతో మాట్లాడుతూ చాలా నెర్వెస్ ఫీల్ అయినట్టు కనిపించింది. ఇక తాజాగా ప్రవేశ్ తన తప్పును తెలుసుకున్నాడని..అందుకే అతన్ని జైలు నుంచి విడిచిపెట్టాలని రావత్ కోరడం వెనుక ఎవరైనా ఉన్నారా అని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. ముందుగా అసలు ప్రవేశ్ ఈ పని చేయలేదన్న రావత్.. రెండు రోజులకే మాట మార్చాడు. తప్పు తెలుసుకున్నాడంటూ.. వదిలేయండంటూ పోలీసులను కోరాడు. ఇదంతా రావత్‌తో కావాలనే చెప్పిస్తున్నారని కాంగ్రెస్ వాదన. అసలేం జరిగిందంటే..: రావత్ అనే 36ఏళ్ల గిరిజన కూలీ ముఖంపై ప్రవేశ్ శుక్లా మూత్రం పోశాడు. సిధీ జిల్లా కుబ్రి గ్రామంలో జరిగిందీ ఘటన. ప్రవేశ్ సిగరెట్ తాగుతూ..మద్యం మత్తులో ఈ పని చేశాడు. ఈ ఘటనకు సంబంధించి సీఎం ఆదేశాల మెరకు శుక్లాను అరెస్టు చేశారు పోలీసులు. ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. జాతీయ భద్రతా చట్టం కింద కూడా అదుపులోకి తీసుకున్నారు. శుక్లా బీజేపీ నేత అని ప్రచారం జరగగా.. అతనికి తమ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని బీజేపీ తోసిపుచ్చింది. తమ పార్టీని అప్రదిష్ట పాలు చేసేందుకు కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి