Bank News: బ్యాంక్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. డబ్బు రెట్టింపు చేసుకునే అవకాశం..త్వరపడండి! హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన కస్టమర్లకు తీపి కబురు అందించింది. కరోనా సమయంలో మొదలైన స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్ జూలై 7తోనే ముగియగా.. ఇప్పుడా గడువును ఈ ఏడాది నవంబర్ 7వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ సీనియర్ సిటిజెన్ కేర్ FD లో భాగంగా 5 సంవత్సరాల ఒక రోజు నుంచి 10 సంవత్సరాల టెన్యూర్ FD పై 7.75 శాతం వడ్డీ రేటు ఆఫర్ చేస్తోంది. By Trinath 10 Jul 2023 in బిజినెస్ Scrolling New Update షేర్ చేయండి రూ.లక్ష పెడితే ఇంకో రూ.లక్ష పొందొచ్చు. అంటే రూ. 2 లక్షలు లభిస్తాయి. ఎలా అని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ప్రముఖ బ్యాంకింగ్ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ(HDFC)లో ఈ అవకాశం అందుబాటులో ఉంది. రిస్క్ లేకుండా రాబడి పొందాలని భావించే వారు ఈ అవకాశం వినియోగించుకోవచ్చు. ఫిక్సిడ్ డిపాజిట్ ద్వారా ఇది సాధ్యమవుతోంది. నిజానికి గతంలోనే ఈ తరహా రేట్లు ఉన్నా.. ఇప్పుడా ఛాన్స్‌ని మరింత పొడిగిస్తూ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. డబ్బులు ఎఫ్‌డీ చేయడానికి స్పెషల్ స్కీమ్ మరికొంత కాలం అందుబాటులో ఉండనుంది. ప్రతికాత్మక చిత్రం FD చేసుకునే వాళ్లకి వరం: ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఈ సీనియర్ సిటిజెన్ కేర్ FD లో భాగంగా 5 సంవత్సరాల ఒక రోజు నుంచి 10 సంవత్సరాల టెన్యూర్ FD పై 7.75 శాతం వడ్డీ రేటు ఆఫర్ చేస్తోంది. ఇక సాధారణ వడ్డీ రేట్ల విషయానికి వస్తే 7 రోజుల నుంచి పదేళ్ల వ్యవధి ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3 శాతం నుంచి 7.25 శాతం వడ్డీ ఇస్తోంది. 2023, మే 29 నుంచి ఈ వడ్డీ రేట్లు అమల్లో ఉన్నాయి. కరోనా సమయంలో హెచ్‌డీఎఫ్‌సీ ఈ స్కీమ్‌ని తీసుకొచ్చింది. చాలా మంది ఆర్థికంగా ఇబ్బంది పడ్డ సమయంలో ఈ స్కీమ్ రావడంతో చాలా మంది భారీగా ఫిక్సిడ్ డిపాజిట్ చేరారు. సీనియర్ సిటిజన్స్‌కు అధిక రాబడి అందించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇక ఈ స్కీమ్ గడువు జూలై 7తో ముగిసింది. అయితే తాజాగా బ్యాంక్ ఈ ఎఫ్‌డీ స్కీమ్ గడువు పొడిగించింది. ఈ పథకం ఈ ఏడాది నవంబర్ 7 వరకు అందుబాటులో ఉంటుందని కస్టమర్లకు తీపి కబురు అందించింది. ఓవైపు తీపి మరోవైపు చేదు: స్పెషల్ FD స్కీమ్ గడువును పెంచుతూ నిర్ణయం తీసుకున్న హెచ్‌డీఎఫ్‌సీ అటు ఈఎంఐ(EMI)ల విషయంలో మాత్రం కస్టమర్లకు గట్టి షాక్ ఇచ్చింది. తన రుణ రేట్లను మరింత పెంచుతూ డిసిషన్ తీసుకుంది. ఈ నిర్ణయంతో ఇప్పటికే లోన్లు తీసుకున్న కస్టమర్లతో పాటు, తీసుకోనున్న వాళ్ల మీద EMI భారం పెరుగుతుంది. బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం కొత్త రుణ వడ్డీ రేట్లు మార్చి 7, 2023 నుంచి అమలులోకి వచ్చాయి. ఈ పెరుగుదల తర్వాత HDFC బ్యాంక్ హోమ్ లోన్ EMI పెరుగుతుంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఎంసిఎల్‌ఆర్‌ను 5 బేసిస్ పాయింట్ల (బిపిఎస్) వరకు పెంచింది. బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం ఓవర్ నైట్ MCLR ఇప్పుడు 8.65 శాతంగా ఉంది. ఒక నెల MCLR 8.65 శాతం, మూడు నెలల MCLR 8.70 శాతం, ఆరు నెలల MCLR 8.80 శాతంగా ఉంటుంది. ఒక సంవత్సరం MCLR ఇప్పుడు 8.95 శాతం, రెండు సంవత్సరాల MCLR 9.05 శాతం మూడు సంవత్సరాల MCLR 9.15 శాతంగా నిర్ణయించారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి