HBD Naga Chaitanya: నేడు అక్కినేని వారసుడు నాగ చైతన్య బర్త్ డే.. 14 ఏళ్ల కెరియర్ లో ప్రతీ సినిమా స్పెషలే!

సినీ లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు కుటుంబం నుంచి మూడో తరం నట వారసుడు నాగ చైతన్య పుట్టిన రోజు నేడు. 2009లో జోష్ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన ఈ అక్కినేని కుర్రోడు తండ్రి, తాత బాటలో అన్ని రకాల సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక ముద్ర వేశారు.

HBD Naga Chaitanya: నేడు అక్కినేని వారసుడు నాగ చైతన్య బర్త్ డే.. 14 ఏళ్ల కెరియర్ లో ప్రతీ సినిమా స్పెషలే!
New Update

HBD Naga Chaitanya:  అక్కినేనిని నటవారసుడిగా సినిమాల్లోకి వచ్చిన అక్కినేని నాగచైతన్య విభిన్న సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. 2009 లో జోష్ సినిమాతో నాగచైతన్య హీరోగా ఎంట్రీ ఇచ్చారు. నాగ చైతన్య హీరోగా నటించిన మొదటి సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ ఈ సినిమాలో నాగ చైతన్య నటనకు ఫిలిం ఫెయిర్, నంది అవార్డులు వరించడం విశేషం.

publive-image

సినిమా కెరియర్

ఆ తర్వాత 2010 లో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఘట్టమనేని మంజుల నిర్మాతగా సమంత హీరోయిన్ గా తెరకెక్కిన 'ఏ మాయ చేశావే' సినిమా నాగ చైతన్యకు మంచి పేరు తీసుకువచ్చింది. ఈ సినిమాలో నాగ చైతన్య నటనకు విమర్శకుల నుంచి ప్రశంశలు దక్కాయి. ఇప్పటికీ తెలుగు సినిమాల్లో 'ఏ మాయ చేశావే' ఒక మంచి క్లాసిక్ చిత్రంగా నిలిచిపోయింది. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో నాగ చైతన్య వరుస అవకాశాలతో బిజీ అయ్యారు. 2011లో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 100% లవ్ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు ఈ అక్కినేని యువ హీరో. కానీ ఆ తర్వాత వచ్చిన దడ, దోచేయ్, తడాఖా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. 2013 లో అక్కినేని మూడు తరాల హీరోలు నాగేశ్వర్ రావు, నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన మనం చిత్రం మంచి హిట్ గా నిలచి ప్రేక్షకుల మనస్సులను తాకింది. ఆ తర్వాత 'రారండోయ్ వేడుక చూద్దాం', ప్రేమమ్, శైలజ రెడ్డి అల్లుడు, వెంకీ మామ చిత్రాలతో వరుస విజయాలను అందుకున్నారు. 2019 లో సమంతతో కలిసి నటించిన మూడో చిత్రంతో కెరియర్ లో అతి పెద్ద విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు నాగ చైతన్య. రీసెంట్ గా లవ్ స్టోరీ, బంగార్రాజు చిత్రాలతో సక్సెస్ అందుకున్నారు.

publive-image

publive-image

publive-image

publive-image

publive-image

వ్యక్తిగత జీవితం

అక్కినేని నాగార్జున, వెంకటేష్ సోదరి లక్ష్మి దంపతుల కుమారుడు నాగ చైతన్య. నాగ చైతన్య హైదరాబాద్ లో జన్మించారు. ఆ తర్వాత తన పేరెంట్స్ విడిపోయాక చెన్నైలో తన తల్లి లక్ష్మి దగ్గరకు వెళ్లిపోయారు. అక్కడే తన చదువు పూర్తి చేసుకున్నారు. నాగ చైతన్యకు కార్లు అంటే చాలా ఇష్టం. సమయం దొరికితే కార్ రేస్ చూడడం లేదా పాల్గొనడం చేస్తుంటారు. 2017 లో అక్టోబర్ 6 న ప్రముఖ హీరోయిన్ సమంతను ప్రేమ వివాహం చేసుకున్నారు. టాలీవుడ్ లో ది బెస్ట్ కపుల్ అనే పేరు కూడా తెచ్చుకున్నారు. కానీ పెళ్ళైన నాలుగు సంవత్సరాలకే వీరిద్దరూ విడాకులు తీసుకోవడం ఇరువురి అభిమానులను షాక్ కు గురి చేసింది. 2021 అక్టోబర్ 2 న సమంత, నాగ చైతన్య తమ సోషల్ మీడియా వేదికగా.. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల విడిపోతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం వీళ్లిద్దరు ఎవరి కెరియర్ లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇప్పటికే వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో టాక్ నడుస్తూనే ఉండడం విశేషం.

publive-image

Also Read: Extra Ordinary Man: ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ షూట్ లో నితిన్, శ్రీలీల స్టెప్పులు.. డాన్స్ వీడియో వైరల్..!

#akkineni-naga-chaithanya-birthday-special #akkineni-naga-chaitanya
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe