New Ration Cards : కొత్త రేషన్ కార్డుకు అప్లయ్ చేసుకున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్ ...ఏంటో తెలుసా?

కొత్త రేషన్ కార్డులను తాము కచ్చితంగా ఇస్తామన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.అభయ హస్తం కింద ఐదు గ్యారెంటీల లబ్దికొరకు దరఖాస్తు చేసుకునేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అర్హులకు తప్పకుండా రేషన్ కార్డులు మంజూరు చేస్తామని తెలిపారు.

New Ration Cards : కొత్త రేషన్ కార్డుకు అప్లయ్ చేసుకున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్ ...ఏంటో తెలుసా?
New Update

Apply New Ration Cards : తెలంగాణ(Telangana) లో రేవంత్ రెడ్డి(Revanth Reddy) సర్కార్ దూసుకుపోతుంది. 6 గ్యారెంటీలే లక్ష్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ఆ హామీలను అమలు చేసేందుకు సాధ్యసాధ్యాలను నిశితంగా పరిశీలిస్తుంది. దీనిలో భాగంగానే గతేడాది డిసెంబర్ 28వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన(Praja Palana) పేరుతో 5 గ్యారెంటీలకు దరఖాస్తులను స్వీకరిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ 5 గ్యారెంటీల(5 Guarantees)కు సంబంధించి రోజుకు 8 లక్షల నుంచి 10 లక్షల వరకు అప్లికేషన్లు వస్తున్నాయి. వీటిలో మహాలక్ష్మీ స్కీం(Mahalakshmi Scheme)కు దరఖాస్తులు అధికంగా వస్తున్నట్లు అధికారులు తెలిపారు. వీటి తర్వాత ఇందిరమ్మ ఇళ్ల(Indiramma Houses)కు దరఖాస్తు చేసుకునేందుకు జనం పోటెత్తుతున్నారు.

వీటికంటే కూడా రేషన్ కార్డు(Ration Cards)ల కోసం దరఖాస్తులు అత్యధికంగా వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆరు గ్యారెంటీలకు రేషన్ కార్డు తప్పనిసరి కావడంతో...చాలా మంది వీటికి దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే గత ప్రభుత్వంలో పదేళ్లలో ఒకసారి మాత్రమే రేషన్ కార్డులను మంజూరు చేసినా..పెండింగ్ దరఖాస్తులు(Pending Applications) ఇంకా చాలానే ఉన్నాయి. వాటి ఆమోదం కోసం దరఖాస్తు దారులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు సర్కార్ మారడంతో రేషన్ కార్డుల ఆమోద ప్రక్రియ అటకెక్కింది. మళ్లీ కొత్తగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులకు కూడా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అయితే దీనిపై చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

తమ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను కచ్చితంగా ఇస్తుందన్నారు. మంచిర్యాల జిల్లా క్యాతన్ పల్లి మున్సిపాలిటీ 16వ వార్డులో జరుగుతున్న ప్రజాపాలన కార్యక్రమంలో అభయ హస్తం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...అభయ హస్తం కింద ఐదు గ్యారెంటీల లబ్దీకొరకు దరఖాస్తు చేసుకునేలా చూడాలన్నారు. అప్లయ్ చేయని వాళ్లుంటే అధికారులు వాళ్లింటికి వెళ్లి వారితో మాట్లాడాలని తెలిపారు. ఇప్పటికే మహిళలకు ఉచిత ప్రయాణ పథకం, రాజీవ్ ఆరోగ్యశ్రీ రూ. 10లక్షలకు పెంపు అమలు చేస్తున్నట్లు తెలిపారు. కొత్త రేషన్ కార్డులకు అప్లయ్ చేసుకున్నవారిలో అర్హులను గుర్తించి తప్పకుండా వాళ్లకు రేషన్ కార్డులను మంజూరు చేస్తామని తెలిపారు.

ఇది కూడా చదవండి: ప్రయాణికులకు గుడ్ న్యూస్..సంక్రాంతి కానుకగా 32 స్పెషల్ ట్రైన్స్..ఏయే మార్గాల్లో అంటే?

#prajapalana #congress-govt #new-ration-cards
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe