Aliens: మనుషుల మధ్యే ఏలియన్లు.. శాస్త్రవేత్తల సంచలన నిజాలు

ఏలియన్స్‌ అంటే ఎక్కడో అంతరిక్షంలో ఉంటాయిలే అనే అంచనాలను తలకిందులు చేస్తుంది హార్వర్డ్‌ యూనివర్సిటీ సర్వే. రూపం మార్చుకుని మనుషుల మధ్య జీవించే అవకాశాలు ఉన్నాయన్నారు. ఫ్లయింగ్ సాసర్లు లో వచ్చి ఉండొచ్చనే కోణంలో పరిశోధనలు చేస్తున్నట్లు శాస్త్రవేత్తల బృందం పేర్కొంది.

New Update
Aliens: మనుషుల మధ్యే ఏలియన్లు.. శాస్త్రవేత్తల సంచలన నిజాలు

Aliens On Earth: ఏలియన్స్‌ అంటే ఎక్కడో అంతరిక్షంలో ఉంటాయిలే అనే అంచనాలను తలకిందులు చేస్తుంది హార్వర్డ్‌ యూనివర్సిటీ సర్వే. ఇన్నాళ్లు ఏలియన్స్‌(Aliens) అంటే ఎక్కడో అంతరిక్షంలో ఉంటాయిలే అనే అంచనాలను తలకిందులు చేస్తుంది హార్వర్డ్‌ యూనివర్సిటీ సర్వే. ఏకంగా భూమి మీద అదికూడా మనుషుల మధ్యే ఏలియన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఏలియన్స్‌ కి ఒక నిర్దిష్టమైన రూపం ఉండదని అంటున్నారు హార్వర్డ్‌ యూనివర్సిటీ(Harvard University) శాస్త్రవేత్తలు.

Also Read:Hyderabad: అవినీతికి అడ్డాగా ఆ పోలీస్ స్టేషన్.. ఒకే సారి 12 మంది సీఐలు, నలుగురు ఎస్ఐలు ఔట్!

రూపం మార్చుకుని మనుషుల మధ్యే రహస్యంగా నివసిస్తుండొచ్చని అభిప్రాయపడుతున్నారు. ఏలియన్స్‌కు సంబంధించి యూఎఫ్‌వోలపై ఏర్పాటు చేసిన హ్యూమన్ ఫ్లరిషింగ్‌ ప్రోగ్రామ్‌లో పరిశోధనలను శాస్త్రవేత్తలు ఈ విధంగా ప్రచురించారు. ఏలియన్స్‌ భూగర్భం లోపల.. అలాగే చంద్రుడిపై నివసిస్తూ ఉండొచ్చని పేర్కొన్నారు. అలాగే.. రూపం మార్చుకుని మనుషుల మధ్య కూడా జీవించే అవకాశాలు ఉన్నాయన్నారు. భూమిపై నివసించే వారి కోసం ఫ్లయింగ్ సాసర్లు లో వచ్చి ఉండొచ్చనే కోణంలో పరిశోధనలు చేస్తున్నట్లు శాస్త్రవేత్తల బృందం పేర్కొంది. అయితే.. ఈ మూడు విషయాలపై హార్వర్డ్‌ యూనివర్సిటీ అంచనా వేసింది కానీ.. ఆధారాలను బయటపెట్టలేదు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు