Tirupati : ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన హర్షవర్థన్ రాజు!

తిరుపతి నూతన ఎస్పీగా హర్షవర్థన్ రాజు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత కొన్నిరోజులుగా ప్రజల్లో పోలీసులపై విశ్వాసం తగ్గుతోందన్నారు. రాబోయే కాలంలో పోలీసులపై ప్రజల్లో నమ్మకం పెరిగే విధంగా ప్రయత్నం చేస్తామని, రాజీకీయ నాయకులు చట్టాన్ని ఉల్లఘించవద్దని కోరారు.

New Update
Tirupati : ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన హర్షవర్థన్ రాజు!

Tirupati New SP : తిరుపతి (Tirupati) నూతన ఎస్పీగా హర్షవర్థన్ రాజు (Harsha Vardan Raju) బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆదివారం తిరుపతిలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తిరుపతి లాంటి ప్రాంతంలో ఎస్పీగా అవకాశం రావడం గర్వకారణంగా భావిస్తున్నానన్నారు. అలాగే ఓట్ల లెక్కింపులోనూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూస్తామని చెప్పారు. 'గత కొన్నిరోజులుగా జరుగుతున్న ఘటనలతో ప్రజల్లో పోలీసులపై అపనమ్మకం, విశ్వాసం తగ్గుతోంది. రాబోయే కాలంలో పోలీసులపై ప్రజల్లో నమ్మకం పెరిగే విధంగా ప్రయత్నం చేస్తాం. రాజకీయ పార్టీల (Political Parties) నేతలు చట్టాన్ని ఉల్లఘించవద్దు. రాజకీయ పార్టీల నేతలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. తిరుపతి లాంటి అతి ముఖ్యమైన ప్రాంతంలో విధ్వంసకరమైన ఘటనలు జరగడం దురదృష్టకరం అన్నారు.

Also Read : హైదరాబాద్ నుంచి తాడిపత్రికి జేసీ ప్రభాకర్ రెడ్డి.. పోలీసులు హై అలర్ట్..!

Advertisment
తాజా కథనాలు