/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/BATHINI-jpg.webp)
Bathini Harinath Goud : ఆస్తమా, ఉబ్బసం బాధితులకు చేప మందు (Fish prasadam) పంపిణీ చేయడంలో బత్తిని సోదరులు ప్రాచుర్యం పొందారు. ఇద్దరు సోదరులలో పెద్దవారైన బత్తిని హరినాథ్ గౌడ్ (Bathini Harinath Goud) మరణించారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో బుధవారం రాత్రి తుదిశ్వాసవిడిచారు. బత్తిని హరినాథ్ గౌడ్ మరణంతో ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బత్తిని సోదరులు అని పేరు చెప్పగానే చేపమందు ప్రసాదం గుర్తుకు వస్తుంది.
ప్రతిసంవత్సరం మృగశిర కార్తె నాడు హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో బత్తిని సోదరులు చేపమందు పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. చేపమందు ప్రసాదం తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా దేశంలోని పలు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో బాధితులు తరలివస్తుంటారు. గత 173సంవత్సరాలుగా బత్తిని కుటుంబం చేపమంది ఇస్తోంది. అదే సంప్రదాయాన్ని బత్తిన సోదరులు కొనసాగిస్తూ వస్తున్నారు. బత్తిన హరినాథ్ గౌడ్ కు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన అంతిమ దహనసంస్కారాలు రేపు జరుగుతాయని ఆయన కుటుంబ సభ్యులు ప్రకటించారు. కాగా గత కొన్నేళ్లుగా హరినాథ్ గౌడ్ మధుమేహం సమస్యతో బాధపడుతున్నారని...ఈక్రమంలో ఆయన ఆరోగ్యం క్షీణించిందని ఆయన కుమార్తె చెబుతూ కన్నీంటిపర్యంతమయ్యారు. బత్తిని హరినాథ్ గౌడర్ మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు.