AP: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు హరిరామ జోగయ్య లేఖ.. బ్రిటీష్ కాలం నుండి.. కాపులకు విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు చేగొండి హరిరామ జోగయ్య లేఖ రాశారు. త్వరలో కాపు రిజర్వేషన్ పై కూటమి ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. By Jyoshna Sappogula 27 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి New Update షేర్ చేయండి Harirama Jogaiah: కాపులకు విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కాపు బలిజ సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య లేఖ రాశారు. కాపులకు విద్య ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించాలని బ్రిటీష్ కాలం నుండి డిమాండ్ చేస్తున్నామన్నారు. EWS 10 శాతం కోటాలో కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ గతంలో టీడీపీ ప్రభుత్వం ఆమోదించిందని అయితే, వైసీపీ ప్రభుత్వంలో జగన్ కాపుల రిజర్వేషన్ అమలు చేయకుండా నిలిపివేశారన్నారు. కాపులకు రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉందంటూ అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారన్నారు. కాపులకు రిజర్వేషన్ కల్పించడానికి వైసీపీ ప్రభుత్వం విముఖత తెలుపుతూ న్యాయ స్థానంలో పిటీషన్ దాఖలు చేసిందన్నారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం త్వరలో కాపు రిజర్వేషన్ పై సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. Also Read: పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ OSD కృష్ణతేజ.. పంచాయతీ సమస్యలపై ఫోకస్..! #harirama-jogaiah మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి