Hardik Pandya: పాండ్యా కోసం బీసీసీఐ స్పెషల్ ప్లాన్!.. వరల్డ్ కప్ లోగా టీంలోకి తిరిగొస్తాడా? కీలక సమయాల్లో గాయాలపాలై కెరీర్‌లో బ్రేక్ తీసుకోవడం హార్ధిక్ పాండ్యాకు పరిపాటి. కీలకమైన టీ 20 ప్రపంచకప్‌కు ముందు చీలమండ గాయంతో మరోసారి అవకాశాలను జటిలం చేసుకున్నాడు హార్ధిక్. అయితే, వచ్చే ఐపీఎల్ సీజన్లోగా హార్ధిక్ తిరిగి గ్రౌండ్ లో అడుగుపెట్టేలా బీసీసీఐ స్పెషల్ కేర్ తీసుకుంటోంది. By Naren Kumar 05 Dec 2023 in స్పోర్ట్స్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి T20 World Cup 2024: కీలక సమయాల్లో గాయాలపాలై కెరీర్‌లో బ్రేక్ తీసుకోవడం స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా (Hardik Pandya)కు పరిపాటిగా మారింది. కీలకమైన టీ 20 ప్రపంచకప్‌కు ముందు మరోసారి చీలమండ గాయంతో అవకాశాలను జటిలం చేసుకున్నాడు హార్ధిక్. వన్డే వరల్డ్‌కప్‌లో లీగ్‌లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో జారిపడ్డాడు. అయితే, తనకు అలవాటైన మాదిరిగానే రెట్టించిన ఉత్సాహంతో హార్ధిక్ తిరిగి టీంలో చేరేలా బీసీసీఐ స్పెషల్ కేర్ తీసుకుంటోందట! గతంలోనూ 2021 టీ20 ప్రపంచకప్‌కు ముందు వెన్నునొప్పితో టోర్నీకి దూరమైన హార్ధిక్ పాండ్యా ఇప్పుడు మరోసారి గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నాడు. ఓ దశలో వెన్నునొప్పి తీవ్రంగా వేధించడంతో ఇక కెరీర్ ముగిసినట్లే అని అంతా భావించారు. అయితే, అందరి అంచనాలనూ తలకిందులు చేస్తూ గోడకు కొట్టిన బంతిలా గెటాన్ అయ్యాడు. 2022 ఐపీఎల్‌లో అనుమానాలను పటాపంచలు చేస్తూ బ్లాస్టింగ్ ఇన్నింగ్స్‌తో పాటు బంతితోనూ ప్రత్యర్థులను చిత్తు చేసి గుజరాత్ టైటాన్స్‌కు కప్పును సాధించిపెట్టాడు. ఇంకేముంది! తగ్గేదే లేదంటూ టీ20ల్లో భారత సారథిగా ఎదిగాడు. పలు సిరీస్‌లలో జట్టును విజయపథంలో నడిపించాడు. అయితే వరల్డ్ కప్‌లో గాయం తర్వాత హార్ధిక్ ఫిట్‌నెస్‌పై ఇంకా స్పష్టత రాకపోవడం టీం మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. ఇది కూడా చదవండి: కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించడంపై స్పందించిన గంగూలీ.. ఏమన్నారంటే టీ20 ప్రపంచకప్ నాటికి టీంలో చేరుతాడా! 2024లో జూన్ 4 నుంచి పొట్టి క్రికెట్ వరల్డ్ కప్ స్టార్టవుతుంది. ఈ పరిస్థితుల్లో హార్ధిక్ జట్టుకు దూరమవడం ఆందోళన కలిగించే విషయమే. అయితే, హడావుడిగా ఇప్పుడే సిరీస్‌లకు సెలెక్ట్ చేయొద్దని జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తోందట. దాంతో టీ20కి సూర్యకుమార్ యాదవే కెప్టెన్‌గా కొనసాగబోతున్నాడు. హార్దిక్ కోసం స్పెషల్ ప్లాన్ పొట్టి క్రికెట్ ప్రపంచ సమరానికి ముందు భారత్ రెండు టీ20 సిరీస్‌లలో మాత్రమే తలపడనుంది. సౌతాఫ్రికాతో సిరీస్‌కు సూర్యకుమార్ కెప్టెన్సీ బాధ్యత స్వీకరించాడు. అఫ్గనిస్తాన్‌తో సిరీస్‌కు కూడా హార్దిక్‌ను తిరిగి రప్పించకుండా నిపుణుల పర్యవేక్షణలో హై పర్ఫామెన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేయాలని బీసీసీఐ నిర్ణయించిందట. గతంలో శ్రేయస్, బుమ్రా, కేఎల్ రాహుల్ గాయపడిన సందర్భాల్లోనూ ఇలాంటి ఏర్పాట్లు చేశారు. మొత్తానికి 2024 ఐపీఎల్ నాటికి హార్దిక్ పాండ్యా తిరిగి గ్రౌండ్‌లో అడుగుపెట్టేలా ప్లాన్ చేస్తున్నారు. #t20-world-cup-2024 #bcci #hardhik-pandya మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి