Friendship Day 2024 : ప్రతీ సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం రోజున ఫ్రెండ్‌షిప్ డే (Friendship Day) జరుపుకుంటారు. నేడు ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.
ఫ్రెండ్‌షిప్ డే ప్రాముఖ్యత
జాతి, మతం, రంగు, ప్రాంతం, మధ్య తేడా లేకుండా ఏర్పడే స్నేహం.. అనే గొప్ప అనుబంధానికి గుర్తుగా ఈరోజును జరుపుకుంటారు. ప్రతీ ఒక్కరి జీవితం (Life) లో మర్చిపోలేని ఒక స్నేహితుడు ఉంటాడు. స్నేహనికి వయసు పరిమితి కాదు. ఏ వయసులోనైనా, ఎవరితోనైనా స్నేహ బంధం ఏర్పడవచ్చు. జీవితం తల్లిదండ్రులు, కుటుంబం తర్వాత అంతగా విలువిచ్చే బంధం స్నేహం. హద్దులు లేకుండా ఎలాంటి విషయాలనైనా పంచుకోవడం, ఒకరినొకరు అంగీకరించుకోవడమే నిజమైన స్నేహం. అయితే ఫ్రెండ్‌షిప్ డే సెలబ్రేషన్‌ను ఎవరు మొదలుపెట్టారు..? స్నేహానికి కూడా ఒక రోజు ఉండాలనే ఆలోచన ఎవరికి వచ్చింది? ఫ్రెండ్‌షిప్ డే చరిత్ర ఏమిటి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాము
ఫ్రెండ్ షిప్ డే చరిత్ర
ఫ్రెండ్‌షిప్ డే ఆలోచనను 1958లో జాయిస్ హాల్ తొలిసారిగా అందించారు. జాయిస్ హాల్ హాల్‌మార్క్ కార్డ్‌ల స్థాపకుడు. స్నేహితుల మధ్య బంధాల ద్వారా ప్రేరణ పొందారు. ఆ తర్వాత స్నేహితులు తమ స్నేహాన్ని, ప్రేమను పంచుకోవడంతో పాటు జరుపుకోవాలనే ఆలోచన అతని మదిలో వచ్చింది. మిస్టర్ హాల్ (Mr. Hall) ఆలోచనను ప్రజలు చాలా ఇష్టపడ్డారు. ఇక క్రమంగా ఎక్కువ మంది ఫ్రెండ్‌షిప్ డేని జరుపుకోవడం ప్రారంభించారు. అలా ప్రపంచవ్యాప్తంగా స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభమైంది.
1998లో ఐక్యరాజ్యసమితి (United Nations) జూలై 30ని అంతర్జాతీయ స్నేహ దినోత్సవంగా ప్రకటించింది. ఆ తర్వాత, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 2011 సంవత్సరంలో ఆగస్టు మొదటి ఆదివారాన్ని ఫ్రెండ్‌షిప్ డేగా జరుపుకోవాలని నిర్ణయించింది. ఫ్రెండ్‌షిప్ డే ప్రజలు, దేశాలు, సంస్కృతులు, విభిన్న వ్యక్తుల మధ్య ప్రేమ, శాంతిని సృష్టించడంలో సహాయపడుతుంది. మనుషుల మధ్య బంధానికి వారధిలా పనిచేస్తుంది. అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని జూలై 30న జరుపుకుంటారు. కానీ అమెరికా, ఇండియా లాంటి దేశాల్లో ఆగస్టు మొదటి ఆదివారం ఫ్రెండ్ షిప్ డేగా జరుపుకుంటారు.
Also Read: Mohanlal: లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో.. వయనాడ్‌లో మోహన్ లాల్ పర్యవేక్షణ - Rtvlive.com