/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/nithin-jpg.webp)
కొన్ని సినిమాల టైటిళ్లు చిరకాలం గుర్తుండిపోతాయి. అందులోనూ సూపర్ హిట్ సినిమాల పేర్లు అయితే ప్రేక్షకుల మదిలో నిలిచిపోతాయి. అలాంటి సినిమాల పేర్లు మళ్లీ పెట్టాలంటే ఓ సాహసమే అనే చెప్పాలి. ఇప్పటికే పాత సినిమాల టైటిళ్లు ఎన్నో రిపీట్ అయ్యాయి. ఇప్పుడు పవన్ కల్యాణ్ హిట్ మూవీ 'తమ్ముడు' పేరును ఆయన వీరాభిమాని నితిన్ తన సినిమాకు టైటిల్‌గా పెట్టుకున్నాడు. పవర్ స్టార్‌కు బయట అభిమానులతో పాటు ఇండస్ట్రీలోనూ అభిమానులు ఉన్నారు. అందులో నితిన్ పేరు ముందు వరుసలో ఉంటుంది. ఎందుకంటే పవన్ కల్యాణ్ అంటే నితిన్‌కి అంత అభిమానం. ఎన్నో సార్లు బహిరంగంగానే తన అభిమానం చాటుకున్నాడు.
పదేళ్ల క్రితం వచ్చిన 'గుండెజారి గల్లంతయ్యిందే' సినిమాలో తొలిప్రేమ మూవీలోని ఏమైందో ఈ వేళ పాటను రీమిక్స్ చేసి అభిమానులను అలరించిన సంగతి తెలిసిందే. అలాగే మరికొన్ని సినిమాల్లో పవన్ ప్రస్తావన తీసుకువస్తూ ఉంటాడు. ఇప్పుడు అయితే ఏకంగా తన కొత్త సినిమాకు పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమా తమ్ముడు టైటిల్‌ను పెట్టుకున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు నిర్మించనున్న ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఆదివారం ఘనంగా జరిగాయి.
Some titles come with a lot of responsibility attached.
We will deliver beyond your expectations.
My next with Sriram Venu and dil raju garu @SVC_Official is #THAMMUDUpic.twitter.com/cfUkKcGBYS
— nithiin (@actor_nithiin) August 27, 2023
''కొన్ని టైటిళ్లు చాలా బాధ్యతను మోసుకుని వస్తాయి.. ప్రేక్షకుల అంచనాలను మించి తాము సినిమా తీస్తామని" అని నితిన్ ట్వీట్ చేయగా.. ''రక్త సంబంధం కంటే అనుబంధం బలమైంది. కొత్త తమ్ముడు వస్తున్నాడు'' అని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ట్విట్టర్‌లో పేర్కొంది. దిల్ రాజు నిర్మాణ సంస్థలోనే 'ఓ మై ఫ్రెండ్', 'మిడిల్ క్లాస్ అబ్బాయి', 'వకీల్ సాబ్' సినిమాలు చేసిన వేణు శ్రీరామ్.. ఇప్పుడు ఈ చిత్రం కూడా అదే సంస్థలో చేయడం విశేషం. ఇక 'దిల్', 'శ్రీనివాస కళ్యాణం' తర్వాత దిల్ రాజుతో కలిసి మూడో చిత్రం చేస్తున్నాడు నితిన్.
Bonding is thicker than blood, make way for new brother in town.
Stage is all set for brother to take over. #THAMMUDU 💥💥@actor_nithiin#SriramVenu@SVC_Officialpic.twitter.com/zCXJ2DOxZk
— Sri Venkateswara Creations (@SVC_official) August 27, 2023
నితిన్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో 'ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మ్యాన్' మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న విడుదల కానుంది. ఇక 'భీష్మ' దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు ఏమో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' సినిమాను నిర్మిస్తున్నాడు.