Hair Care: జుట్టు రాలుతుందా? డాన్‌డ్రఫ్ వేధిస్తుందా? ఈ చిన్న చిట్కా పాటించండి చాలు! చాలా మంది బట్టతల, జుట్టు రాలడం, తలలో డాన్డ్రఫ్ సమస్యలతో బాధపడుతుంటారు. ఈ సమస్య ఉన్నవారు ఈ సింపుల్ చిట్కా ట్రై చేయండి. కరివేపాకు, వెల్లుల్లి, కొబ్బరినూనెతో తయారు చేసిన మిశ్రమం జుట్టుకు అప్లై చేయండి. కేవలం ఏడు రోజుల్లోనే మంచి ఫలితాన్ని చూస్తారు. By Archana 28 Dec 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి స్ట్రెస్, టెన్షన్, అనారోగ్య సమస్యలు జుట్టు రాలడానికి కారణమవుతాయి. కొంత మంది జుట్టు రాలడం, బట్టతల సమస్యల కారణంగా ఒత్తిడికి గురవుతారు. ఎన్నో రకాల మెడిసిన్స్, చిట్కాలు పాటించినప్పటికీ.. కొన్ని సార్లు ఆశించిన ఫలితం రాదు. జీవన శైలి విధానాలు, ఆహారపు అలవాట్లు కూడా రాలే సమస్య పై ప్రభావం చూపుతాయి. జుట్టు రాలడం, బట్టతల, డాన్డ్రఫ్ సమస్యలు ఉన్నవారు ఈ సింపుల్ చిట్కా ట్రై చేయండి. కరివేపాకు, వెల్లుల్లి, కొబ్బరినూనెతో తయారు చేసిన మిశ్రమం జుట్టుకు అప్లై చేయండి. కేవలం ఏడు రోజుల్లోనే మంచి ఫలితాన్ని చూస్తారు. ఈ మిశ్రమాన్ని తయారు చేసే విధానం ఇప్పుడు చూద్దాం.. ఈ మిశ్రమానికి కావాల్సిన పదార్థాలు వెల్లుల్లి కరివేపాకు కొబ్బరి నూనె ముందుగా ఎండిన లేదా పచ్చి కరివేపాకు రెమ్మలను తీసుకోవాలి. ఆ తర్వాత వాటిని కాస్త కచ్చా పచ్చాగా గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత వారానికి లేదా మీకు కావల్సినన్ని రోజులకు సరిపడ కొబ్బరి నూనె తీసుకోవాలి. కొబ్బరి నూనె కాసేపు మరిగిన తర్వాత దానిలో కరివేపాకు పొడిని వేసి ఒక 5 నిమిషాల పాటు మరిగించాలి. చివరిగా మరిగించిన మిశ్రమాన్ని స్ట్రైనర్ తో ఒక బౌల్ లో వడకట్టాలి. అంతే ఈ త్రీ స్టెప్స్ లో ఆయిల్ ఈజీగా రెడీ చేసుకోవచ్చు. అప్లై చేసుకునే విధానం ఈ మిశ్రమాన్ని అప్లై చేశాక వెంటనే తల స్నానం చేయకూడదు. మూడు రోజుల తర్వాత 4th చేయాలి. ఆ తర్వాత మళ్లీ 5th డే ఆయిల్ అప్లై చేసి 8th తల స్నానం చేయాలి. ఇలా చేస్తే 7 రోజుల్లో ఫలితం కనిపిస్తుంది. జుట్టు రాలడమే కాదు బట్టతల సమస్య ఉన్నవారి పై కూడా మంచి ప్రభావం చూపుతుంది. కరివేపాకులోని బీటా కెరోటిన్, ప్రోటీన్, విటమిన్ B, C జుట్టు జుట్టుకు పోషకాలను అందించి బలంగా చేస్తుంది. అలాగే వెల్లుల్లి లోని సల్ఫ్యూరిక్ యాసిడ్ జుట్టులో చెడు బ్యాక్టీరియాను చంపేసి.. డాన్డ్రఫ్ కు సమస్యను దూరం చేయును. దాని వల్ల హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. Also Read: అసలుసిసలైన కిక్.. ఉత్కంఠగా పాక్-ఆసీస్ బాక్సిండ్ డే టెస్ట్! #life-style మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి