Sentinelese Tribe: ప్రమాద తెగ చేతిలో మరణించిన అమెరికన్ వ్యక్తి!

ఓ వ్యక్తి ప్రమాదకరమైన తెగను కలవటానికి ప్రయత్నం చేసి ప్రాణాలు కోల్పోయాడు. అక్కడికి వెెళ్లే ముందు తన కుటుంబ సభ్యులకు ఓ లేఖ రాశాడు.అసలు అక్కడికి ఎందుకు వెళ్తున్నాడో..వారిని ఎందుకు కలవాలి అనుకుంటున్నాడో లేఖలో పేర్కొన్నాడు.

New Update
Sentinelese Tribe: ప్రమాద తెగ చేతిలో మరణించిన అమెరికన్ వ్యక్తి!

American Killed by Sentinelese Tribe: ప్రపంచంలో ప్రమాదకరమైన తెగలు చాలా ఉన్నాయి.  కాలక్రమేణా అనేక తెగలు వాస్తవ పరిస్థితులలోకి  చేరిపోయాయి. దాని కారణంగా వారు పట్టణ మార్గాలను అవలంభించారు. కానీ ఇప్పటికీ చాలా తెగలు వాస్తవ పరిస్థితులకు దూరంగా జనారణ్యంలోకి రాకుండా ఒంటరిగా జీవనం సాగిస్తున్నారు. అలాంటి కొన్ని తెగలు పట్టణ మానవుల జీవన విధానాన్ని కాని వారి ఉనికిని కాని అసలు ఇష్టపడరు. అలాంటిదే భారతదేశంలోని అండమాన్ ద్వీపంలో (నార్త్ సెంటినెల్ ద్వీపం) నివసించే సెంటినెలీస్ అటువంటి తెగ ఒకటి. ఇది చాలా ఒంటరి తెగ (సెంటినెలీస్ తెగ) ఇది  చాలా ప్రమాదకరమైనది. అంతేకాకుండా ఎవరైనా వారిని కలిస్తే వారి ప్రాణం పోవడం ఖాయం.

2018 లో, ఒక వ్యక్తి ఈ తెగను కలవడానికి ప్రయత్నించి వారి చేతిలో ప్రాణాలు వదిలాడు. కానీ అతను చనిపోయే ముందు, అతను తన కుటుంబానికి ఒక లేఖ రాశాడు, అందులో అతను ఈ ప్రమాదకరమైన తెగ ప్రజలను ఎందుకు కలవాలనుకుంటున్నాడో చెప్పాడు. మిర్రర్ వెబ్‌సైట్ నివేదిక ప్రకారం, వ్యక్తి తన కుటుంబం పేరుతో ఈ లేఖ రాశాడు. ఆ వ్యక్తి పేరు జాన్ అలెన్ చౌ (John Allen Chau). అతను నిజానికి ఒక అమెరికన్ పర్యాటకుడు.

జాన్ 16 నవంబర్ 2018న సెంటినలీస్ ద్వీపానికి వెళ్లినప్పుడు అక్కడి ప్రమాద గిరిజనుల తెగ చేతిలో హతమయ్యాడు. అతనికి ఆ గిరిజన తెగ ఉండే ప్రాంతాన్ని చూపించటానికి వచ్చిన  మత్స్యకారుడు అతన్ని ఆ ప్రాంతంలో వదిలి పారిపోయాడు. కొన్ని రోజుల  తరువాత, అటుగా  ఓ  మత్స్యకారుడు వెళుతుండగా.. గిరిజనులు జాన్ లాగా ఉన్న వ్యక్తి మృతదేహాన్ని పూడ్చిపెట్టడం చూశాడు. ఆ విషయాన్ని తన తోటి మత్స్యకారులకు చెప్పగా..ఆ వ్యక్తిని తీసుకువెళ్లిన మత్సకారుడికి తెలిపారు. అతన్ని గిరిజనులు బాణంతో చంపి ఉంటారని వారు భావించారు. జాన్ తను రాసుకున్న  జర్నల్‌ బుక్ ను ఆ మత్స్యకారుడు దగ్గర విడిచిపెట్టాడు. అందులో అతని కుటుంబానికి ఒక లేఖ కూడా ఉంది.

ఈ కారణంగానే ఆ వ్యక్తి ఆ దీవికి వెళ్లాడని..
తాను ఇంత ప్రమాదకరమైన ప్రాంతానికి ఎందుకు వెళ్లానో ఈ లేఖలో తెలిపాడు. సెంటినెలీస్ దీవిలో నివసిస్తున్న అత్యంత ప్రమాదకరమైన తెగను క్రైస్తవులుగా మార్చాలనుకుంటున్నట్లు జాన్ చెప్పాడు. అతను మతం, యేసు క్రీస్తు గురించి వారికి బోధించాలనుకున్నాడు. కానీ అతను బోధించలేకపోయాడు. మిర్రర్ వెబ్‌సైట్ ప్రకారం, అతను క్రీస్తు రాజ్యాన్ని స్థాపించాలని మరియు అతని రక్షణలోకి తీసుకురావాలని లేఖలో రాశాడు. తాను చనిపోతే ఆ గిరిజనులను అపార్థం చేసుకోవద్దని అన్నారు.

Also Read: PTI మహిళా రిపోర్టర్ పై ANI ప్రతినిధి దాడి.. షాకింగ్ వీడియో విడుదల!

Advertisment
తాజా కథనాలు