Digestive Health : ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు.. ఈ అలవాట్లు పాటించండి

జీర్ణక్రియ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఈ అలవాట్లను పాటించండి. ఉడికించిన ఆహారాలు తినడం, తగిన ఫైబర్, ఆహారాన్ని సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయడం, సరిపడ నిద్ర, వ్యాయామం, వంటి అలవాట్లు జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతాయి.

New Update
Digestive Health : ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు.. ఈ అలవాట్లు పాటించండి

Digestive System : చాలా మందికి గ్యాస్(Gas), కడుపుబ్బరం, మలబద్దకం వంటి జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతుంటారు. అనారోగ్యపు అలవాట్లు(Unhealthy Habits), జీవన శైలి(Life Style) విధానాలు దీనికి కారణం కావచ్చు. నాణ్యతలేని, కలుషితమైన ఆహారాలు జీర్ణక్రియ వ్యవస్థ పై ప్రభావం చూపుతాయి. కావున జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉండడానికి ఈ అలవాట్లను పాటించండి.

ఆహారాన్ని సరిగ్గా ఉడికించాలి

ఆహారాన్ని(Food) సరిగ్గా ఉడికించడం చాలా ముఖ్యం. లేకపోతే వాటిలోని హానికర సూక్ష్మ క్రిములు ఆరోగ్యం పై ప్రభావం చూపుతాయి. అందులో మాంసాహారాన్ని 74° C ఉష్ణోగ్రతల పైనే ఉడికించాలి. పచ్చి పచ్చిగా ఆహారాన్ని తింటే ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం ఉంటుంది.

ఆహారాన్ని సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయాలి

ఆహారాన్ని సరైన ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాలి. లేదంటే వాటి పై బాక్టీరియా, ఫంగస్, పెరిగే ప్రమాదం ఉంటుంది. పచ్చి మాంసం వంటి వాటిని 0°c వద్ద నిల్వ చేయాలి. అలాగే పొడి, తడి ఆహారాలను వేరు వేరుగా స్టోర్ చేయాలి.

Also Read : Curd: భారతీయ భోజనంలో.. పెరుగు ఎందుకు ఉంటుందో తెలుసా..?

Digestive System

తగిన ఫైబర్ తీసుకోవాలి 

మన రోజువారీ ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. ఫైబర్ మలబద్ధకం, గ్యాస్, కడుపుబ్బరం వంటి జీర్ణక్రియ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. పండ్లు, కూరగాయలు,ఆకుకూరలు తింటే శరీరానికి కావాల్సిన ఫైబర్ లభిస్తుంది.

సరైన నిద్ర, వ్యాయామం

రోజూ 6-8 గంటలు తప్పకుండా నిద్ర పోవాలి. సరైన నిద్ర లేకపోతే జీర్ణక్రియ పై ప్రభావం చూపుతుంది. అలాగే ఆహరం సులువుగా జీర్ణం అవ్వడానికి వ్యాయామం చేయాలి. వ్యాయామం చేయడం శరీరంలో కొవ్వును కూడా తగ్గించడానికి సహాయపడుతుంది.

నీళ్లు బాగా తాగాలి

జీర్ణక్రియ మెరుగ్గా పని చేయడానికి నీళ్లు బాగా తాగాలి(Drinking Water). నీళ్లు ఆహారాన్ని విచ్ఛిన్నం చేసి.. పోషకాల శోషణకు ఉపయోగపడుతుంది. అలాగే మోషన్ ఫ్రీగా ఉండడానికి తోడ్పడుతుంది.

Also Read: Banana Cup Cake: టేస్టీ, యమ్మీ బనాన కప్ కేక్ .. ఇంత ఈజీనా..! ట్రై చేయండి

Advertisment
తాజా కథనాలు