GV Prakash and Saindhavi:  మేం విడిపోయాం అంటున్న మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్-గాయని సైంధవి 

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ గాయని సైంధవితో తన వివాహ బంధం ముగిసిపోయిందని ప్రకటించారు. మా మానసిక ఆరోగ్యం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం అని చెప్పారు. 11 ఏళ్ల క్రితం ఒక్కటైన ప్రకాష్- సైంధవి జంటకు నాలుగు సంవత్సరాల పాప ఉంది. 

New Update
GV Prakash and Saindhavi:  మేం విడిపోయాం అంటున్న మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్-గాయని సైంధవి 

GV Prakash and Saindhavi: ప్రభాస్ డార్లింగ్ సినిమా మ్యూజిక్ డైరెక్టర్.. నటుడు జీవీ ప్రకాష్.. గాయని సైంధవి తమ వివాహ బంధానికి వీడ్కోలు చెప్పారు. తానూ.. సైంధవి విడిపోయామని జీవీ ప్రకాష్ స్వయంగా ప్రకటించారు. జీవీ ప్రకాష్ ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ మేనల్లుడు. జీవీ ప్రకాష్-సైంధవి 11 ఏళ్ల క్రితం వివాహబంధంతో ఒకటయ్యారు. వారికి నాలుగేళ్ల పాప ఉంది. సినీ ఇండస్ట్రీలో అన్యోన్యమైన జంటగా వీరికి మంచి పేరు ఉంది. అటువంటిది వీరి విడాకుల వార్త విని అభిమానులు షాక్ అయ్యారు. 

GV Prakash and Saindhavi: “చాలా ఆలోచించి సైంధవి, నేనూ విడిపోవడమే మంచిది అని భావించి విడిపోతున్నాం. మేము 11 సంవత్సరాల వివాహబంధానికి ముగింపు పలికాం. మా మానసిక ఆరోగ్యం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం” అని తమ విడాకులపై జీవీ ప్రకాష్ మీడియాకు క్లారిటీ ఇచ్చారు. ఈ జంట విడాకులు తీసుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఇది ఆయన అభిమానులను కలవరపరిచింది. దీనిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

GV Prakash and Saindhavi: “ఈ వ్యక్తిగత పరివర్తన సమయంలో మా ప్రైవసీని  గౌరవించాలని మేము మీడియా, స్నేహితులు - అభిమానులను కోరుతున్నాము. మేము విడిపోతున్నాము. ఇది ఉత్తమ నిర్ణయం అని మేము భావిస్తున్నాము. ఈ క్లిష్ట సమయంలో మీ అవగాహన - మద్దతు ముఖ్యం" అని ప్రకాష్ అన్నారు.

Also Read:  గ్రాండ్ గా ‘కన్నప్ప’ టీజర్ లాంచ్.. పోస్టర్ తో అప్డేట్ ఇచ్చిన మంచు విష్ణు!

ప్రకాష్ తన చిన్ననాటి స్నేహితురాలు గాయని సైంధవిని 2013లో వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు 2020లో పాప పుట్టింది. ఇప్పుడు ఆమెకు నాలుగు సంవత్సరాలు. 

GV Prakash and Saindhavi: గత సంవత్సరం, సైంధవి సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌ను పంచుకున్నారు.  వారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు.  ఇప్పుడు వీరిద్దరూ విడిపోతున్నట్లు ప్రకటించడం అభిమానులకు షాకిస్తోంది. పలు తమిళ సినిమాలకు సంగీత దర్శకత్వం వహించిన జీవీ ప్రకాష్.. తెలుగులోనూ సూపర్ హిట్ సినిమాలకు మ్యూజిక్ ఇచ్చారు. ప్రభాస్ డార్లింగ్, నానీ.. జండాపైకపిరాజు, రవితేజ.. టైగర్ నాగేశ్వరరావు, రాజారాణి, ఇంద్రుడు వాటిలో కొన్ని. తమిళ సినిమా సూరారై పోట్రు కు గాను జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. ఇక గాయని సైంధవి భారతీయ కర్ణాటక సంగీత గాయకురాలు. ఆమె 12 సంవత్సరాల వయస్సు నుండి ప్రదర్శనలు ఇస్తూ వచ్చారు.  సైమా అవార్డ్స్ 2021లో ఆమెకు తమిళ చిత్రసీమలో ఉత్తమ నేపథ్య గాయని పురస్కారం దక్కింది. పలు తెలుగు సినిమాల్లో ఆమె సూపర్ హిట్ పాటలు పాడారు. 

Advertisment
తాజా కథనాలు