Ananthapuram: అనంతపురం జిల్లా గుర్రపుకొండ ఎగువతాండ గ్రామ ప్రజలు రోడ్డు సమస్యపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా గ్రామాలకు దారేదని పాలకులను ప్రశ్నిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. అనారోగ్య సమస్యలు వచ్చినా, గర్భణీ స్త్రీలను ఆసుపత్రికి తరలించాల్సి వచ్చినా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంబులెన్స్ రావడానికి దారి కూడా లేదని అంటున్నారు.
Also Read: అలా నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటా.. కారుమూరి సునీల్ సవాల్..!
ఎన్నికల సమయంలో ఓటు కోసం రోడ్డు వేస్తామని రాజకీయ నాయకులు ఇప్పటివరకు అందరూ మాట ఇస్తూ వస్తున్నారని అయితే, ఏ ఒక్కరూ తమ సమస్య తీర్చడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పశువులతో పిల్లలతో రోడ్డుపై బైఠాయించారు. రోడ్డు సమస్యపై ఎవ్వరూ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. విసుగెత్తి రోడ్డుపై ధర్నాకు వచ్చామంటున్నారు రెండు గ్రామాల ప్రజలు. అధికారులు, పాలకులు ఇప్పడైనా రోడ్డు సమస్యను తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు.