Guntur - Rayagada Express Train Derailed: విజయనగరం జిల్లా కంటకాపల్లి వద్ద ఘోర రైలు ప్రమాదం(Train Accident) చోటు చేసుకుంది. రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నారు.
ఓవర్ హెడ్ కేబుల్ తెగిపోవడంతో విశాఖ-రాయగడ ప్యాసింజర్ రైలు పట్టాలపైనే నిలిచిపోయింది. అయితే, అదే సమయంలో దూసుకొచ్చిన పలాస ఎక్స్‌ప్రెస్ ట్రైన్.. ఆగి ఉన్న ప్యాసింజర్ రైలును వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. అయితే, రెండు రైళ్లు ఢీకొనడంతో బోగీలు పట్టాలు తప్పాయి. ప్రమాదం స్పందించిన అధికారులు.. వెంటనే ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కోరుకొండ - అలమండ మధ్య సరిగ్గా 7:10 గంటల సమయంలో ఒకే ట్రాక్ పైకి రెండు రైళ్లు వచ్చాయి ముందు ఉన్న ట్రైన్‌ను వెనుక నుంచి మరో ట్రైన్ ఢీకొట్టింది. దాంతో విశాఖ-పలాస ప్యాసింజర్ ట్రైన్‌కు సంబంధించిన 3 బోగీలు బోల్తా పడ్డాయి. అయితే, ప్రమాద స్థలంలో చీకట్లు అలుముకోవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుంది.
Also Read:
అదే జరిగితే రేవంత్ ఎప్పుడో జైలుకెళ్లేవాడు.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్..