Shocker: రూ.20 ఆశ చూపి రూ.10లక్షలు కొట్టేశారు.. అమృతం సీరియల్‌ సీన్ రిపీట్‌..!

గుంటూరు మిర్చి వ్యాపారి వద్ద గుమాస్తాగా పని చేసే హరిబాబు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో 10 లక్షలు విత్‌డ్రా చేసుకొని వస్తుండగా 20 రూపాయల నోటు కింద పడింది. చూసుకోమని దృష్టి మలిచి 10 లక్షలు దోచేశారు కేటుగాళ్లు .

Shocker: రూ.20 ఆశ చూపి రూ.10లక్షలు కొట్టేశారు.. అమృతం సీరియల్‌ సీన్ రిపీట్‌..!
New Update

అమృతం సీరియల్ గుర్తింది కదా..? తెలుగు టెలివిజ‌న్ సీరియ‌ల్ చరిత్ర‌లో అమృతం ఓ క్లాసికల్‌ హిట్. ఈ సీరియ‌ల్ ఎంతో మంది ప్రేక్ష‌కుల‌ను టీవీలకు కట్టిపడేసింది. అందులో ఓ ఎపిసోడ్ ఉంటుంది. బ్యాంకు దోపిడి దొంగలపై ఉండే ఎపిసోడ్ అది. బ్యాంకులో నుంచి లక్షలు డ్రా చేసుకోని వచ్చినవాళ్లకి రోడ్డుపై చిల్లర పడిపోయిందని ఆశ చూపి..రెప్పపాటు వ్యవధిలో డబ్బులున్న బ్యాగ్‌ని చోరీ చేస్తుంటూరు కేటుగాళ్లు. వాళ్ల తిక్క కుదిర్చేందుకు 'సర్వం' బరిలోకి దిగుతాడు. ఖాళీ బ్యాగుల్లో చెత్తాచెదారం నింపి.. బ్యాంకుల వద్ద దొంగలను బురిడీ కొట్టించి చిల్లర డబ్బులను జేబులో వేసుకుంటాడు. కానీ గుంటూరు జరిగిన ఘటనలో సర్వం లేడు.. అందుకే దొంగలదే పైచేయి. రూ.20ఆశ చూపి ఏకంగా 10లక్షల రూపాయలు కొట్టేసిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

publive-image రూ.20 ఆశ చూపి రూ.10లక్షలు కొట్టేశారు (సీసీటీవీ)

స్మార్ట్‌గా దోచేశారు:
దొంగల తెలివితేటలు మాములుగా ఉండవు.. సందు దొరికితే టవర్లను మాయం చేసే బుర్ర వాళ్లది. గుంటూరులోని లక్ష్మీపురం హెచ్‌డీఎఫ్‌సీ(HDFC)బ్యాంకు బయట జరిగిన ఘటన రెండు తెలుగురాష్ట్రాల్లో సంచలనంగా మారింది. హరిబాబు అనే వ్యక్తి బ్రాడిపేటలోని మిర్చి వ్యాపారి వద్ద గుమాస్తాగా పని చేస్తున్నాడు. డబ్బులు విత్‌డ్రా చేయాల్సింది ఉందని యజమాని చెప్పాడు. దీంతో బ్యాంకుకు చేరుకున్న హరిబాబు 10లక్షల రూపాయలను విత్‌డ్రా చేసి మొత్తం బ్యాగులో సర్ధుకున్నాడు. అప్పటికే ముగ్గురు ముసుగు దొంగలు మాస్క్‌తో బ్యాంకులోనే కస్టమర్లు లాగా ఫోజ్‌ కొడుతూ ఉన్నారు. హరిబాబు బయటకు వెళ్లిన వెంటనే ఆ ముగ్గురు బయటకు వచ్చారు. ముందుగా అందులో ఇద్దరు బైక్‌ వద్దకు వెళ్లిపోగా.. మరొకరు మాత్రం బ్యాంక్‌ గేట్ వద్దనే నిలబడి ఉన్నాడు.

రూ.20 కోసం పాపం..
హరిబాబు తన బైక్‌ వద్దకు బ్యాగ్‌తో చేరుకున్నాడు. ఇంతలోనే పక్కన నుంచి ఒక అతను నడుచుకుంటూ వస్తు తన జేబులో నుంచి 20రూపాయలను కింద పడేశాడు. 'నీ డబ్బులు పడిపోయాయి చూస్కో' అంటూ చెప్పి వెనక్కి వెళ్లిపోయాడు. ఈలోపు హరిబాబు ఆ 20రూపాయల కోసం కిందకు వంగాడు. అంతే ఫ్రెక్షన్‌ ఆఫ్ సెకండ్స్‌లో అప్పటివరకు రోడ్డుపైనే గుంటనక్కలా కాపుకాచుకొని ఉన్న ఇద్దరు దొంగల్లో ఒకరు బ్యాగ్‌తీసుకొని పరిగెత్తారు.గేర్‌ వేసి ఉంచిన మరో దొంగతో కలిసి బైక్‌తో జంప్‌ అయ్యాడు. 20రూపాయలను తీసుకున్న హరిబాబు లేచి చూసేసరికి బ్యాగ్‌ కనపడలేదు. 20రూపాయలు పడిపోయాయని చెప్పిన అతను కూడా కనపడలేదు. తాను మోసపోయానని తెలుసుకున్న హరిబాబు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ని పరీశిలించగా..అసలు విషయం క్లియర్‌కట్‌గా కనపడింది. ఇటివలి మంగళగిరిలోనూ ఇదే తరహా ఘటనలు వెలుగుచూశాయి. బైక్‌పై నుంచి కిందపడిపోతున్నట్టు యాక్ట్ చేయడం.. ఎవరో ఒకరు వాళ్లకి హెల్ప్ చేయడానికి రావడం.. వెనక నుంచి పాకెట్‌లోని సెల్‌ఫోన్‌ని చోరీ చేయడం లాంటివి జరిగాయి. ప్రస్తుతం లక్ష్మీపురం బ్యాంక్‌ చోరీ ఘటన కూడా వాళ్లే పనేనని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను సాధ్యమైనంత త్వరగా అదుపులోకి తీసుకుంటామంటున్నారు. ఎక్కువ డబ్బులు, గోల్డ్‌ లాంటివి క్యారీ చేసే సమయంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe