అమృతం సీరియల్ గుర్తింది కదా..? తెలుగు టెలివిజన్ సీరియల్ చరిత్రలో అమృతం ఓ క్లాసికల్ హిట్. ఈ సీరియల్ ఎంతో మంది ప్రేక్షకులను టీవీలకు కట్టిపడేసింది. అందులో ఓ ఎపిసోడ్ ఉంటుంది. బ్యాంకు దోపిడి దొంగలపై ఉండే ఎపిసోడ్ అది. బ్యాంకులో నుంచి లక్షలు డ్రా చేసుకోని వచ్చినవాళ్లకి రోడ్డుపై చిల్లర పడిపోయిందని ఆశ చూపి..రెప్పపాటు వ్యవధిలో డబ్బులున్న బ్యాగ్‌ని చోరీ చేస్తుంటూరు కేటుగాళ్లు. వాళ్ల తిక్క కుదిర్చేందుకు ‘సర్వం’ బరిలోకి దిగుతాడు. ఖాళీ బ్యాగుల్లో చెత్తాచెదారం నింపి.. బ్యాంకుల వద్ద దొంగలను బురిడీ కొట్టించి చిల్లర డబ్బులను జేబులో వేసుకుంటాడు. కానీ గుంటూరు జరిగిన ఘటనలో సర్వం లేడు.. అందుకే దొంగలదే పైచేయి. రూ.20ఆశ చూపి ఏకంగా 10లక్షల రూపాయలు కొట్టేసిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
పూర్తిగా చదవండి..Shocker: రూ.20 ఆశ చూపి రూ.10లక్షలు కొట్టేశారు.. అమృతం సీరియల్ సీన్ రిపీట్..!
గుంటూరు మిర్చి వ్యాపారి వద్ద గుమాస్తాగా పని చేసే హరిబాబు హెచ్డీఎఫ్సీ బ్యాంకులో 10 లక్షలు విత్‌డ్రా చేసుకొని వస్తుండగా 20 రూపాయల నోటు కింద పడింది. చూసుకోమని దృష్టి మలిచి 10 లక్షలు దోచేశారు కేటుగాళ్లు .
Translate this News: