Mahesh Babu: సూపర్ స్టార్ ఊర మాస్ లుక్‌..నెట్టింట్లో వైరల్..!!

దసరా సందర్భంగా ప్రిన్స్ మహేశ్ బాబు మాస్ పోస్టర్ ను నెట్టింట్లో పోస్ట్ చేసింది గుంటూరు కారం మూవీ టీమ్. దసరా పండుగ, ఆయుధ పూజని పురస్కరించుకుని పోస్టర్‌ను రిలీజ్ చేశారు. సినిమాలో మహేశ్‌ బాబు ఊర మాస్ లుక్‌లో ఉన్న ఒక పిక్‌ని రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. ఈ మూవీ 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.

New Update
Mahesh Babu: సూపర్ స్టార్ ఊర మాస్ లుక్‌..నెట్టింట్లో వైరల్..!!

Guntur Karam: సూపర్ స్టార్ మహేష్ బాబు(Super Star Mahesh Babu) లేటెస్ట్ మూవీ గుంటూరు కారం(Guntur Karam) పై రోజురోజుకు అందరిలో భారీ స్థాయి అంచనాలు పెరుగుతున్నాయి. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీని త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తుండగా హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్న గుంటూరు కారంలో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, రఘుబాబు, జగపతిబాబు, సునీల్, హైపర్ ఆది తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Also Read: బాలకృష్ణ మాటలను జీవితాంతం గుర్తు పెట్టుకుంటా..!!

publive-image

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ ను మేకర్స్ ప్రకటించారు. ప్రేక్షకులకు దసరా శభాకాంక్షలు చెబుతూ.. ప్రిన్స్ మహేశ్ మాస్ పోస్టర్ ను సోషల్ మీడయాలో పోస్ట్ చేశారు. దసరా పండుగ, ఆయుధ పూజ ని పురస్కరించుకుని ఈ మూవీ నుండి మహేష్ బాబు ఊర మాస్ లుక్ లో ఉన్న ఒక పిక్ ని రిలీజ్ చేసారు మేకర్స్. అలానే ఫస్ట్ సాంగ్ ని అతి త్వరలో రిలీజ్ చేస్తాం అంటూ పోస్టర్ లో మేకర్స్ ప్రకటించారు. ఈ పిక్ ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దాదాపు పన్నెండేళ్ల తర్వాత మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తోన్న చిత్రమే 'గుంటూరు కారం'. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో అందరికీ తెలిసిందే. వాటికి ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని తీస్తున్నారు. దీంతో ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు