Guntur Kaaram: గుంటూరు కారం..ఈ 4 చాలా ప్రత్యేకం

New Update
Guntur Kaaram: గుంటూరు కారం..ఈ 4 చాలా ప్రత్యేకం

Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు(super star mahesh babu), స్టార్ డైరక్టర్ త్రివిక్రమ్(Trivikram Srinivas) కలిసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 12 సంవత్సరాల తర్వాత వీళ్లిద్దరూ కలిసి గుంటూరు కారం అనే మూవీ చేస్తున్నారు. స్క్రిప్ట్, నటీనటులు, సాంకేతికతలో మార్పులు వంటి కొన్ని సమస్యలతో బాధపడుతున్న ఈ చిత్రం, తాజాగా మరోసారి సెట్స్ పైకొచ్చింది.

ఈ సినిమా స్క్రీన్ ప్లేపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేసిన త్రివిక్రమ్, సెట్స్ పైకి వచ్చేందుకు ఓకే చెప్పాడు. అలా గుంటూరుకారం కొత్త షెడ్యూల్ మొదలైంది. అయితే ఇప్పుడీ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అంశం వెలుగులోకి వచ్చింది. మార్చిన స్క్రీన్ ప్లే ప్రకారం, గుంటూరుకారంలో 4 అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్స్‌ ఉన్నాయని తెలుస్తోంది.

ఈ చిత్రంలో 4 యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని, అవి భారీగా ఉండనున్నాయని సమాచారం. అంతేకాదు, ఈ 4 యాక్షన్ ఎపిసోడ్స్, వేటికవే భిన్నంగా ఉంటాయంట. రీసెంట్‌గా ఈ మూవీకి సంబంధించి ఓ యాక్షన్‌ ఎపిసోడ్‌ పూర్తి చేశాడు మహేష్. ఈ వారం నుంచి కొత్త యాక్షన్‌ ఎపిసోడ్‌ని షూట్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

త్రివిక్రమ్ అంటేనే మంచి డైలాగ్స్, కామెడీకి పెట్టింది పేరు. కానీ మహేష్ తో కలిసిన ప్రతిసారి ఈ దర్శకుడు, యాక్షన్ ఎలిమెంట్స్ కు కూడా ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నాడు. గుంటూరుకారం కూడా అందుకు మినహాయింపు కాదు. గుంటూరుకారం సినిమాలో మహేష్ నుంచి పాన్ ఇండియా లెవెల్ ఎలివేషన్లు ఉన్నట్టు తెలుస్తోంది.

అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్-త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూవీ ఇది. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై చినబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. శ్రీలీల మెయిన్ హీరోయిన్ కాగా, సెకెండ్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తోంది. థమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. తొలి లిరికవ్ వీడియోను దసరాకు ప్లాన్ చేస్తున్నారట.

Advertisment
తాజా కథనాలు