Ananthapuram: భక్తి భావంతో ఉప్పొంగిపోతున్న గుంతకల్లు..! అయోధ్యలో బాల రాముని విగ్రహ ప్రతిష్ట సందర్భంగా గుంతకల్లు భక్తి భావంతో ఉప్పొంగిపోయింది. ముఖ్యంగా పురవీధులలో అయోధ్యలోని బాల రాముని విగ్రహ ప్రతిష్ట వీక్షించేందుకు పెద్ద ఎత్తున స్క్రీన్ లను ఏర్పాటు చేశారు. యువకులు పెద్ద ఎత్తున కాషాయ జెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. By Jyoshna Sappogula 22 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ అనంతపురం New Update షేర్ చేయండి Ananthapuram: అయోధ్యలో బాల రాముని విగ్రహ ప్రతిష్ట సందర్భంగా గుంతకల్లు భక్తి భావంతో ఉప్పొంగిపోయింది. ముఖ్యంగా పురవీధులలో అయోధ్యలోని బాల రాముని విగ్రహ ప్రతిష్ట వీక్షించేందుకు పెద్ద ఎత్తున స్క్రీన్ లను ఏర్పాటు చేశారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయంలో శ్రీ సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. Also Read: ‘రాముడిని క్షమించమని వేడుకుంటున్నా’.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు ఆలయంలోని మూల విరాట్ శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీరాముల వారి విగ్రహాలను కొలువు తీర్చి వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ పూజలు నిర్వహించారు. అతి పురాతనమైన శ్రీ కోదండరామ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ వాసవి మాత దేవాలయంలో శ్రీ సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయస్వామి విగ్రహాలకు సామూహిక అభిషేకాలు అర్చనలు పూజలు నిర్వహించారు. Also Read: నమ్రతకు.. మహేష్ బాబు బ్యూటీఫుల్ విషెస్.. వైరలవుతున్న ట్వీట్ శ్రీ త్యాగరాజు స్వామి ఆలయం, బెంచ్ కొటాలలోని పురాతన కోదండరామస్వామి ఆలయంలో పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. పురవీధులు కాషాయమయంగా మారాయి. బిజెపి ఆధ్వర్యంలో యువకులు పెద్ద ఎత్తున కాషాయ జెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. #andhra-pradesh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి