Mallareddy: మల్లారెడ్డి మరో స్కామ్.. ఆ కాలేజీలు కూలగొట్టుడు ఖాయం: మాజీ సర్పంచ్ మాజీ మంత్రి మల్లారెడ్డిపై రూ.20 కోట్ల పరువు నష్టం దావా వేస్తున్నట్లు గుండ్లపోచంపల్లి మాజీ సర్పంచ్ ఈశ్వర్ తెలిపారు. ఆక్రమించిన స్థలాల్లో కాలేజీలు కట్టాడని ఆరోపించారు. ఈ విషయంపై తాను దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. By Nikhil 03 Apr 2024 in తెలంగాణ హైదరాబాద్ New Update షేర్ చేయండి మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి హరితహారం కింద పెద్ద స్కామ్ చేశారని గుండ్లపోచంపల్లి మాజీ సర్పంచ్ ఈశ్వర్ ఆరోపించారు. 32 వేల చెట్లను మల్లారెడ్డి ఉమెన్స్ కాలేజీలో నాటినట్లు చెప్పాడని.. ఇప్పుడు ఒక్క చెట్టు లేదన్నారు. ఇందుకోసం అప్పటి మంత్రులు, ఉన్నతాధికారులను పిలచి చెట్లు నాటించి నాటకాలాడరని ధ్వజమెత్తారు. ఈ రోజు ఆయన మాట్లాడుతూ.. మల్లారెడ్డి రోడ్డు పక్కన భూమి కొని చెరువు వెనక వరకు కబ్జా చేస్తాడని ఆరోపించారు. కోమటి కుంట అలుగును మళ్లించి కబ్జా చేశాడని ధ్వజమెత్తారు. 2019లో 5 కోట్ల ఫైన్ కట్టి కాలేజీలకు చెందిన అనేక ఎకరాల స్థలాలు రెగ్యులరైజ్ చేసుకున్నాడన్నారు. మల్లారెడ్డి కబ్జాలు నిజం కాకపోతే మున్సిపల్ అధికారులు కాలేజీలకు వెళ్లే రోడ్డును కూలకొడితే ఎందుకు ఫిర్యాదు చేయలేదన్నారు. యూనివర్సిటీ పెట్టిన భూములకు కూడా అనుమతులు లేవన్నారు. వెంచర్ చేసిన భూములకు తిరిగి పాస్ పుస్తకాలు పొందాడన్నారు. ఈ విషయంపై కోర్టుకు పోతున్నానన్నారు. అనుమతులు లేకుండా కాలేజీల్లో ఐదు అందస్తులు కట్టాడన్నారు. ఖచ్చితంగా ఆ కాలేజీలు కూల్చాల్సి వస్తుందన్నారు. తనపై చేసిన ఆరోపణలకు రూ.20 కోట్లకు పరువు నష్టం దావా వేస్తున్నట్లు చెప్పారు. తాను అందరి లాంటి వాడిని కాదన్నారు. ఈశ్వర్ ఇంకా ఏమన్నారో ఈ కింది వీడియోలో చూడండి. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి