GunaSekhar : ఎట్టకేలకు కొత్త సినిమా అనౌన్స్ చేసిన గుణశేఖర్.. ఆసక్తికరంగా టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియో!

క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ ఎట్టకేలకు తన కొత్త ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశాడు. తాజాగా తన కొత్త సినిమాను ప్రకటిస్తూ టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియో రిలీజ్ చేయగా.. ఈ టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియో సినిమాపై ఆసక్తి పెంచింది. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

New Update
GunaSekhar : ఎట్టకేలకు కొత్త సినిమా అనౌన్స్ చేసిన గుణశేఖర్.. ఆసక్తికరంగా టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియో!

Gunasekhar New Project Euphoria Tittle Reveal : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్రియేటివ్ డైరెక్టర్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్న గుణశేఖర్ ఎట్టకేలకు తన కొత్త ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశాడు. గత ఏడాది శాకుంతలం మూవీతో నిరాశ పరిచిన ఈయన ఈసారి జోనర్ మార్చి ఓ సరికొత్త కథతో రాబోతున్నాడు. తాజాగా తన కొత్త సినిమాను ప్రకటిస్తూ టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియో రిలీజ్ చేయగా.. ఈ టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియో సినిమాపై ఆసక్తి పెంచింది.

గుణ శేఖర్ కొత్త ప్రాజెక్ట్ 'యుఫోరియా'

చూడాలని ఉంది, ఒక్కడు, రుద్రమదేవి వంటి సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గుణశేఖర్.. గత కొంతకాలంగా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ మూవీస్ చేస్తున్నాడు. అలా వచ్చిన రుద్రమదేవి ఆడియన్స్ ను ఆకట్టుకోగా.. గత ఏడాది వచ్చిన శాకుంతలం డిజాస్టర్ గా నిలిచింది. సమంత టైటిల్ రోల్ లో నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టులేకపోయింది.

దీంతో ఈసారి జోనర్ పూర్తిగా మార్చి ఓ సరికొత్త కథతో రాబోతున్నాడు. గుణ శేఖర్ తన కొత్త సినిమాకి 'యుఫోరియా' అనే టైటిల్ ని ఖరారు చేశారు. గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై నీలిమ గుణ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అతి త్వరలోనే స్టార్ట్ కానుందని మేకర్స్ తెలిపారు. తాజాగా రిలీజ్ చేసిన టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియో సినిమాపై ఆసక్తి పెంచింది.

Also Read: మరోసారి డీప్ ఫేక్ బారిన పడ్డ రష్మిక మందన..!

Advertisment
తాజా కథనాలు