Social Media: కొట్టేసింది పోలీసు బండిని..సోషల్‌ మీడియాలో సెల్ఫీ..నువ్వు గ్రేట్‌ సామి!

పోలీసు వాహనాన్ని కొట్టేసిన ఓ దొంగ దాంతో సెల్ఫీ దిగి సోషల్‌ మీడియాలో పెట్టడంతో పోలీసులు నిందితున్ని పట్టుకున్నారు. ఈ సంఘటన గుజరాత్‌ లోని ద్వారకాలో జరిగింది.

New Update
Social Media: కొట్టేసింది పోలీసు బండిని..సోషల్‌ మీడియాలో సెల్ఫీ..నువ్వు గ్రేట్‌ సామి!

ప్రస్తుత రోజుల్లో సోషల్‌ మీడియా (Social Media)  వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడి పోలీసులు మాత్రం సోషల్‌ మీడియా ద్వారా ఓ దొంగను (Thief)  పట్టుకున్నారు. గతంలో ఓ కేసులో నిందితుడిగా ఉన్న ఈ దొంగ విచారణ సమయంలో ఈసారి ఎలాగైనా పోలీసు వాహనాన్ని (Police Vehicle)  దొంగతనం చేస్తానని పోలీసులకే సవాల్‌ విసిరాడు.

అనుకున్నట్లుగానే.. గుజరాత్‌ నుంచి ద్వారకా కి వచ్చాడు మన దొంగ హీరో గారు. అది కూడా బైక్‌ మీద. ద్వారకా పోలీసు స్టేషన్‌ ఎదురుగా బైక్‌ ని పార్క్‌ చేసి దర్జాగా స్టేషన్‌ బయట ఉన్న ఎస్‌యూవీ వాహనాన్ని వేసుకుని బయల్దేరాడు. ట్యాంక్‌ ఫుల్‌ గా పెట్రోల్‌ ఉండడంతో సుమారు ఓ 200 కిలోమీటర్లు వెళ్లాడు.

ఇంతలో సార్ కి ఏం అనిపించిందో ఏమో..ఓ సెల్ఫీ తీసుకుని సోషల్‌ మీడియాలో పెట్టాడు. ఆ ఫోటో కాస్త వైరల్‌ గా మారింది. దీనిని చూసిన
కొందరు పోలీసు అధికారులు తమ పోలీసు స్టేషన్ల వాహనాలను చెక్ చేసుకున్నారు. అప్పుడు అది ద్వారకా పోలీసు స్టేషన్‌ వాహనం అని గుర్తించారు.

వాహనం పోయిందని ఆలస్యంగా గుర్తించిన ద్వారకా పోలీసు అధికారులు మిగిలిన స్టేషన్లను అలర్ట్‌ చేశారు. ఆరు గంటలు కష్టపడిన తరువాత నిందితుడితో పాటు వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. వాహనంలో ఉన్న వ్యక్తిని మోహిత్‌ శర్మ అనే నిందితునిగా గుర్తించారు. గతంలోనే పోలీసు వాహనం ఎత్తుకు పోతా అని చెప్పి ఇప్పుడు చేసి చూపించడంతో పోలీసులు షాక్‌ అయ్యారు.

మోహిత్‌ శర్మ పై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. కాగా గతంలో మోహిత్‌ ఓ పరువు నష్టం కేసులో నిందితునిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గంజాయికి బానిసై మోహిత్ మత్తులోనే పోలీసు వాహనం దొంగలించినట్టు సమాచారం.

Also read: వైసీపీ కక్ష సాధింపు పాలన సాగిస్తోంది: నిర్మాత నట్టి కుమార్‌!

Advertisment
తాజా కథనాలు