తెలంగాణలో టెర్రరిస్టుల కలకలం...!! తెలంగాణలో టెర్రరిస్టుల కార్యకలాపాలు కలకలం రేపుతున్నాయి. గుజరాత్ లోని ఉగ్రవాద అనుమానితుడితో తెలంగాణలోని రామగుండంకు చెందిన అమ్మాయి చాట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఫేస్ బుక్ ద్వారా పరిచయం ఏర్పడి చాట్ జరిగింది. అయితే ఇది మామూలుగానే జరిగిన సంభాషణా లేదా మరేదైనా ఉగ్రకోసం ఉందా అని తేల్చేపనిలో ఏటీఎస్ ఉంది. By Bhoomi 28 Jun 2023 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి తెలంగాణలో మరోసారి ఉగ్రమూలలు భయటపడటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే పాతబస్తీలోని పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు...రామగుండంలోని తండ్రీ కూతుళ్లను అరెస్టు చేశారు. గతకొన్నేళ్లుగా హైదరాబాద్ లో ఉంటున్న తండ్రీకూతుళ్లు నాలుగు రోజులుగా రామగుండంలో తలదాచుకుంటున్నట్లు వచ్చిన పక్కా సమాచారంతో గుజరాత్ ఏటీఎస్ తనిఖీ చేసి వారిద్దర్నీ అరెస్టు చేసింది. తెలంగాణలో మరోసారి ఉగ్రకదలికలు కలకలం రేపుతున్నాయి. గుజరాత్ లో సముద్ర మార్గం ద్వారా పడవల్లో సరిహద్దులు దాటేందుకు యత్నించిన ఉగ్రవాదులను ఏటీఎస్ అరెస్టు చేసింది. వీరిని విచారించగా..వీరితో లింకులు తెలంగాణలో బయటపడ్డాయి. దీంతో నిఘా పెట్టిన ఏటీఎస్ మంగళవారం రామగుండంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది. టెర్రరిస్టులతో సంబంధం ఉందన్న అనుమానంతో మహమ్మద్ జావీద్ ఆయన కుమార్తెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని హైదరాబాద్ లోని ఏటీఎస్ ప్రధాన కార్యాలయానికి తరలించారు. కాగా మహ్మద్ జావీద్ హైదరాబాద్ లోని టోలీ చౌకీలో నివాసం ఉంటున్నట్లు పోలీసులు విచారణలో తెలిసింది. అమీర్ పేటలోని ఓ కోచింగ్ సెంటర్ లో సాఫ్ట్ వేర్ ట్రైనర్ గా పనిచేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. బక్రీద్ సందర్భంగా తన కూతురితో కలిసి నాలుగు రోజుల క్రితం రామగుండం వెళ్లారు. ఈ పక్కా సమాచారంతో గుజరాత్ ఏటీఎష్ తనిఖీలు చేపట్టింది. అయితే వీరికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయన్న సమచారం మేరకే ఏటీఎస్ ఈ సెర్చింగ్ నిర్వహించింది. ఈమధ్య టెర్రరిస్టులతో వాట్సాప్ చాటింగ్ కూడా చేసినట్లు అనుమానిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో పేలుళ్లతో కూడా వీరికి సంబంధం ఉందన్న కోణంలోనూ ఏటీఎస్ విచారణ చేపట్టనుంది. అటు పాతబస్తీలోనూ గుజరాత్ ఏటీఎస్ పోలీసులు ఉదయం నుంచి సోదాలు చేపట్టారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిని కాలపత్తార్ పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే జూన్ 10న కూడా పోలీసులు సోదాలు నిర్వహించి 5గురిని అరెస్టు చేశారు. అందులో ఓ మహిళ కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి