Gudur: ఇంకెన్నాళ్ళు ఈ ట్రాఫిక్‌ కష్టాలు.. !

తామెటూ చూడలేకపోతున్నాం... తమ బిడ్డలైనా ఫ్లైఓవర్‌ పూర్తయితే చూస్తారా..!! అన్న అనుమానం గూడూరు పట్టణ వాసుల్లో నెలకొంది. 12 ఏళ్లుగా ఎదరుచూస్తున్న ప్రజలకు నిరాశే మిగిలింది. గూడూరు పట్టణాన్ని రైల్వేలైన్‌ రెండుగా విభజిస్తోంది. 1వ, 2వ టౌన్‌గా ఏర్పడిన ఈ ప్రాంతంలో అటు ఇటు రాకపోకలకు ప్రజలు నిత్యం రకాలుగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు.

Gudur: ఇంకెన్నాళ్ళు ఈ ట్రాఫిక్‌ కష్టాలు.. !
New Update

ఇంకా ఎన్ని రోజులు

గూడూరు పట్టణాన్ని రైల్వేలైన్‌ రెండుగా విభజిస్తోంది. 1వ, 2వ టౌన్‌గా ఏర్పడిన ఈ ప్రాంతంలో అటు ఇటు రాకపోకలకు ప్రజలు నిత్యం రకాలుగా బాధలు పడుతూనే ఉన్నారు. అయితే ఈ మార్గం మధ్యలో దక్షిణం వైపు అండర్‌ బ్రిడ్జి ఉంది. ప్రస్తుతం నిర్మాణాలు సాగకపోవటంతో తరచూ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. తామెటూ చూడలేకపోతున్నాం... తమ బిడ్డలైనా ఫ్లైఓవర్‌ పూర్తయితే చూస్తారా..!! అన్న అనుమానం గూడూరు పట్టణ వాసుల్లో నెలకొంది. 12 ఏళ్లుగా ఎదరుచూస్తున్న ప్రజలకు నిరాశే మిగిలింది.

publive-image

ఎక్కువ ఇబ్బందులు

12 ఏళ్లకు ముందు ఫ్లైఓవర్‌ నిర్మిస్తారంటే ట్రాఫిక్‌ కష్టాలు తొలగుతాయని ప్రజలు సంబరపడ్డారు. అయితే గూడూరు పట్టణాన్ని సరిగ్గా మధ్య నుంచి చీల్చుతున్నట్లు రైలు మార్గం ఉంది. దీనివల్ల గూడూరు ఒకటి, రెండో పట్టణంగా విడిపోయింది. పైగా జంక్షన్‌ కూడా కావడంతో తిరుపతి, చెన్నై నుంచి వచ్చే రైళ్ల రాకపోకలు అధికంగానే ఉంటాయి. ఈ సమయంలో రెండు పట్టణాలను కలిపే ప్రధాన మార్గంలో రెండు రైల్వే గేట్లను దాటాలి. ఒక్కోసారి గంటలకొద్దీ గేట్లు తెరిచే పరిస్థితి ఉండదు. అత్యవసరమైనపుడు అటుఇటూ వెళ్లడానికి జనం పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.

publive-image

ఆగిపోయిన పనులు

సరైన సమయానికి ఆస్పత్రులకు వెళ్లలేక ప్రాణాలు పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందువల్లే ఫ్లైఓవర్‌ నిర్మిస్తే తమ కష్టాలు తీరిపోతాయని పట్టణవాసులు భావించారు. అనుకున్న రోజు రానే వచ్చింది. గూడూరులో ఫ్లైఓవర్‌ను నిర్మించేందుకు 2011 మార్చి ఐదో తేదీన రూ.39 కోట్లతో ఆనాటి గూడూరు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పనబాక కృష్ణయ్య, కేంద్రమంత్రి పనబాక లక్ష్మి దంపతులు నిర్మాణ పనులు ప్రారంభించారు. రూ.16 కోట్లతో రైల్వేశాఖ పట్టాలపై ఫ్లైఓవర్‌ పనులను పూర్తి చేశారు. రూ.23కోట్లు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. విభజన జరగడం కాంగ్రెస్ ఓడిపోవడం తరువాత టీడీపీ అధికారంలోకి రావడంతో భూ సేకరణకు సంబంధించి పనులు అగిపోయాయి.

publive-image

ముందుకు రాని కాంట్రాక్టర్లు 

అయితే.. 2015 డిసెంబరు 22న భూ సేకరణకు, వంతెన నిర్మాణానికి రూ.63 కోట్లు మంజూరు చేశారు. భూసేకరణ పనులు పూర్తయినా నిర్మాణ పనులు జరగలేదు. దాంతో ఫ్లైఓవర్‌ అసంపూర్తిగా నిలిచిపోయింది. ఈ ఫ్లైఓవర్‌ను 48 శ్లాబులతో నిర్మించాల్సి ఉంది. ప్రస్తుతానికి 27 శ్లాబులు మాత్రమే నిర్మించివున్నారు. తూర్పు గూడూరు వైపునకు 19 శ్లాబులకు గాను 18, అడివయ్యకాలనీ వైపు 13 శ్లాబులకు గానూ 9 శ్లాబులు, సిరామిక్‌ కళాశాల వైపు 12 శ్లాబులకు గానూ ఒక్క శ్లాబు నిర్మాణం కూడా జరగలేదు. తిరిగి నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు రూ.36కోట్ల నిధులను ప్రతిపాదించారు. మూడు పర్యాయాలు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. నిర్మాణ ఖర్చులు పెరగడంతో ప్రతిపాదించిన నిధులు సరిపోవని కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని తెలిసింది. దీంతో మరలా ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులు నిలిచిపోయాయి.

publive-image

#gudur-town-flyover #traffic-problem #many-more-years
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe