AP : హిజ్రాల మధ్య గ్రూప్ వార్.. బర్త్ డే సెలబ్రేషన్స్ జరుగుతుండగా కత్తులు, రాడ్లతో ఇంట్లోకి చొరబడి..

అనంతపురం జిల్లా పుట్టపర్తిలో హిజ్రాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. బ్రాహ్మణపల్లిలో పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న హిజ్రా పల్లవి ఇంట్లోకి చొరబడిన కొందరు హిజ్రాలు రాడ్లు, కత్తులతో దాడికి దిగారు. ఆధిపత్యం నిలుపుకునేందుకే హిజ్రాల మధ్య గ్రూప్ వార్ నడుస్తున్నట్లు తెలుస్తోంది.

New Update
AP : హిజ్రాల మధ్య గ్రూప్ వార్.. బర్త్ డే సెలబ్రేషన్స్ జరుగుతుండగా కత్తులు, రాడ్లతో ఇంట్లోకి చొరబడి..

Anantapur : శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి (Puttaparthi) లో హిజ్రాల (Hijras) మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లిలో పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న హిజ్రా పల్లవి ఇంట్లోకి చొరబడిన పలువురు హిజ్రాలు కత్తులు, రాడ్లు తీసుకొచ్చి విచక్షణ రహితంగా దాడికి తెగబడ్డారు. ఈ ఘటనతో ఆ ప్రాంతం ఒక్కసారిగా ఉద్రిక్తతంగా మారింది.

Also Read: జగన్మోహన్ రెడ్డి కాదు.. లెవన్ రెడ్డి.. అందుకే నిన్న జైలుకు వెళ్లాడు : శ్రీనివాసులు రెడ్డి

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గత కొంతకాలంగా ధర్మవరం, పులివెందుల, పుట్టపర్తికి చెందిన హిజ్రా గ్రూపుల మధ్య విభేదాలు బహిర్గతం అవుతూనే ఉన్నాయి. ఇదే విషయమై ఏడాది కిందట హిజ్రా పల్లవి గ్రూపు సభ్యులు పుట్టపర్తి అర్బన్ పోలీస్ స్టేషన్లో ధర్మవరానికి చెందిన హిజ్రా హాసిని గ్రూపుపై ఫిర్యాదు కూడా చేశారు. ఆధిపత్యం నిలుపుకునేందుకు హిజ్రాల మధ్య గొడవలు (Group War) చోటు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.

Advertisment
తాజా కథనాలు