పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు సాధించినందుకు రాష్ట్ర ప్రజల తరఫున సీఎం కేసీఆర్‌కు మంత్రి శ్రీనివాస్ గౌడ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రాజెక్టుకు ఈఏసీ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంపై ఆయన హర్షం వ్యక్తంచేశారు. కరివెన రిజర్వాయర్ వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం, జలాభిషేకం చేశారు. ఎడారిగా మారిన తెలంగాణను సస్యశ్యామలం చేయాలని సీఎం పడిన తపన ఎంతో గొప్పదని కొనియాడారు. ఆర్డీఎస్ షటర్లు బద్దలు కొట్టి తాగునీటిని ఆంధ్రకు తరలించుకుపోయినా ఆనాటి ముఖ్యమంత్రులు ఏనాడూ స్పందించలేదన్నార. పాలమూరు గోసను చూసిన ఉద్యమనేత కేసిఆర్ జోగులాంబ నుంచి పాదయాత్ర చేశారన్నారు. ప్రాజెక్ట్ అడ్డుకోవడం కోసం ప్రతిపక్షాలు ఎన్నో కుట్రలు చేశాయని ఆరోపించారు. కేంద్రం అనేక కొర్రీలు వేసిందని.. మన ప్రాంతం నాయకులే కేసులు వేసి ప్రాజెక్టును అడ్డుకునేందుకు కుట్రలు చేశారని మండిపడ్డారు.
పూర్తిగా చదవండి..పాలమూరు ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్.. సీఎం కేసీఆర్ చిత్రపటానికి జలాభిషేకం
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు సాధించడంపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ హర్షం వ్యక్తంచేశారు. కరివెన రిజర్వాయర్ వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం, జలాభిషేకం చేశారు. ప్రాజెక్టుకు అన్ని అడ్డంకులు తొలగించిన కేసీఆర్‌కు యావత్ ఉమ్మడి జిల్లా తరఫున పాదాభివందనం చేస్తున్నామని శ్రీనివాస్ గెడ్డి వెల్లడించారు.
Translate this News: