Same Sex Marriage: వివాహ సమానత్వానికి పెద్దపీట.. చారిత్రాత్మక బిల్లుకు క్రిస్టియన్‌ కంట్రీ ఆమోదం!

స్వలింగ వివాహాన్ని చట్టబద్ధం చేసిన తొలి క్రిస్టియన్ ఆర్థోడాక్స్ మెజారిటీ దేశంగా గ్రీస్ నిలిచింది. 176-76 ఓట్లతో గ్రీస్‌ పార్లమెంట్‌లో స్వలింగ వివాహాలకు అనుమతించే బిల్లు ఆమోదం పొందింది. 300 మంది సభ్యులున్న పార్లమెంటులో ఈ బిల్లు ఆమోదం పొందాలంటే సాధారణ మెజారిటీ సరిపోతుంది.

New Update
Same Sex Marriage: వివాహ సమానత్వానికి పెద్దపీట.. చారిత్రాత్మక బిల్లుకు క్రిస్టియన్‌ కంట్రీ ఆమోదం!

Greece Legalise Same Sex Marriage: ప్రపంచం వేగంగా మారుతోంది. స్వలింగ సంపర్కం నేరంగా భావించే రోజుల నుంచి స్వలింగ వివాహాన్ని చట్టబద్ధం చేసే వైపుగా అడుగులు వేస్తోంది. సేమ్‌-సెక్స్‌ మ్యారేజీని లీగల్‌ చేసిన జాబితాల లిస్ట్‌లో గ్రీస్‌ వచ్చి చేరింది. స్వలింగ పౌర వివాహాలను అనుమతించే బిల్లును గ్రీస్ పార్లమెంటు ఆమోదించింది. ఇది LGBT హక్కుల మద్దతుదారులకు చారిత్రాత్మక విజయం. ఈ బిల్లు ఆమోదం LGBT సమాజం ప్రభుత్వానికి థ్యాంక్స్‌ చెప్పింది. పార్లమెంటులోని ప్రేక్షకులతో పాటు, ఏథెన్స్ వీధుల్లో గుమిగూడిన వందాలది LGBT మద్దతుదారులు హర్షధ్వానాలతో ఈ బిల్లు ఆమోదానికి స్వాగతం పలికారు.

ఆ లిస్ట్‌లో మొదటి దేశం:
అనేక యూరోపియన్‌ యూనియన్‌(EU) దేశాలు ఇప్పటికే స్వలింగ వివాహాన్ని చట్టబద్ధం చేశాయి ఇక తాజాగా.ఈ బిల్లును ఆమోదించిన మొదటి మెజారిటీ ఆర్థోడాక్స్ క్రైస్తవ దేశంగా గ్రీస్‌ నిలిచింది. యూరోపియన్ యూనియన్ లోని 27 సభ్యదేశాల్లో 15 దేశాలు ఇప్పటికే స్వలింగ వివాహాన్ని చట్టబద్ధం చేశాయి. ప్రపంచవ్యాప్తంగా 35 దేశాల్లో దీనికి అనుమతి ఉంది. స్వలింగ జంటల వివాహం చేసుకోవడంతో పాటు పిల్లలను దత్తత తీసుకునే హక్కును ఈ చట్టం ఇస్తుంది. 300 స్థానాలున్న పార్లమెంటులో 176 మంది సభ్యులు ఆమోదించిన ఈ బిల్లు ప్రభుత్వ అధికారిక గెజిట్‌లో ప్రచురం కానుంది. ఆ వెంటనే చట్టంగా మారుతుంది.

దశాబ్దాలుగా పోరాటం:
సామాజికంగా సంప్రదాయవాద దేశమైనగ్రీస్‌లో ఇలాంటి బిల్లుకు ఆమోదం లభిస్తుందని గతంలో ఎవరూ ఊహించి ఉండరు. అయితే దశాబ్దాలుగా గ్రీస్‌లోని LGBT కమ్యూనిటీ వివాహ సమానత్వం కోసం పోరాడుతోంది. దాని ఫలితమే ఇవాళ ఈ బిల్లుకు ఆమోదం. చర్చి, మితవాద రాజకీయ నాయకుల ఆటుపోట్లకు వ్యతిరేకంగా ఉద్యమకారులు దశాబ్దాలుగా మార్పు కోసం ప్రయత్నిస్తున్నారు. 2008లో ఒక లెస్బియన్, గే జంట చట్టాన్ని ఉల్లంఘించి టిలోస్ అనే చిన్న ద్వీపంలో వివాహం చేసుకుంది. కాని వారి వివాహాలను ఉన్నత న్యాయస్థానం రద్దు చేసింది. ఇకపై రద్దు చేసే అవకాశం ఉండదు. వామపక్షల మద్దతుతో ఈ బిల్లు నిలిచింది. తమ మతాచారాలను ఇతరులపై బలంగా రుద్దే గ్రీస్ ఆర్థోడాక్స్ క్రిస్టియన్లు ఈ స్వలింగ వివాహ బిల్లును వ్యతిరేకిస్తున్నారు. ఇది బైబిల్ కు వ్యతిరేమని మండిపడుతున్నారు. అయితే వివాహ సమానత్వం అవసరమని గ్రీస్‌ పార్లమెంట్‌ భావించింది.

Also Read: పేయింట్‌ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం.. తొమ్మిది మంది సజీవ దహనం!
WATCH:

Advertisment
తాజా కథనాలు