GWMC: రసాభాసగా వరంగల్ కొర్పొరేషన్ మీటింగ్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పొరేటర్ల ఫైట్! ఈ రోజు జరిగిన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పొరేటర్ల మధ్య తీవ్ర వివాదం చోటు చేసుకుంది. పార్టీ మారిన మేయర్ గుండు సుధారిణికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళన చేశారు. వీరి ఆందోళన మధ్యే బడ్జెట్ కు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. By Nikhil 20 Jun 2024 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశం రసాభాసగా మారింది. పార్టీ మారిన మేయర్ గుండు సుధారాణికి ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని బీఆర్ఎస్, చబీజేపీ కార్పొరేటర్లు ఆందోళన చేశారు. మేయర్ చేతిలోని బడ్జెట్ పేపర్లను చించడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. మేయర్ ఆధ్వర్యంలో బడ్జెట్ సమావేశాలు జరగనీయమంటూ బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు ఆందోళన చేశారు. ఇంకా.. తెలంగాణ రాష్ట్ర చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణాన్ని తొలగించొద్దంటూ బీఆర్ఎస్ ఆందోళన చేసింది. కళాతోరాణం తొలగిస్తే ఊరుకోమంటూ కాంగ్రెస్ సర్కార్ ను బీఆర్ఎస్ కార్పోరేటర్లు హెచ్చరించారు. అయితే.. వీరి ఆందోళనల మధ్యనే 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వరంగల్ కార్పేరేషన్ బడ్జెట్ కు కౌన్సిల్ సమావేశం ఆమోదం తెలిపింది. మొత్తం రూ.650 కోట్ల అంచనాతో ఈ కార్పొరేషన్ బడ్జెట్ ను రూపొందించారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన మేయర్ గుండు సుధారిణిని పదవిలో నుంచి దించేందుకు బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆమెను పదవి నుంచి తప్పించాలని మున్సిపల్ కమిషనర్ తో పాటు కలెక్టర్ ను కార్పోరేటర్లు కలిశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మాట్లాడుతూ.. GWMC సమావేశాల చరిత్రలో ఇంత పోలీసు బందోబస్తు ఎప్పుడు చూడలేదన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తాను మంత్రిగా ఉన్నానని.. అప్పుడు కూడా ఇంత బందోబస్తు లేదన్నారు. ప్రజా ప్రతినిధులు ఏమైనా నక్సలైట్లా అని ప్రశ్నించారు. పోచంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రజా పాలన అని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కానీ, వాస్తవికంగా రాష్ట్రంలో పోలీసు పాలన కొనసాగుతోందన్నారు. బీఆర్ఎస్ కార్పొరేటర్ల జేబులు చెక్ చేస్తున్నారని.. మహిళా కార్పొరేటర్లు అని కూడా చూడకుండా చెక్ చేసి అవమాన పరిచారాని ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ మున్సిపల్ చరిత్రలోనే ఇది చీకటి రోజన్నారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి