TG Politics: మంత్రి శ్రీధర్ బాబుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ.. ఆ 7గురు జంప్?

మంత్రి శ్రీధర్ బాబుతో గ్రేటర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, సుధీర్ రెడ్డి, గోపీనాథ్, కృష్ణారావు, వివేకానంద గౌడ్, రాజశేఖర్ రెడ్డి, అరిక పూడి గాంధీ భేటీ అయ్యారు. నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసమే అని వారు చెబుతున్నా.. పార్టీ మారేందుకే చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

New Update
TG Politics: మంత్రి శ్రీధర్ బాబుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ.. ఆ 7గురు జంప్?

నిన్న బీఆర్ఎస్ మీటింగ్ కు డుమ్మా కొట్టిన గ్రేటర్ ఎమ్మెల్యేలు.. ఈ రోజు మంత్రి శ్రీధర్ బాబును కలవడం చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ లో చేరేందుకు చర్చలు జరుపుతున్నారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిన్న మంత్రి తలసాని ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రేటర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల సమావేశానికి ఏడుగురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి నిన్న మీటింగ్ కు హాజరు కాలేదు.

అయితే.. ఈ రోజు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గోపీనాథ్, కూకట్ పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు, కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరిక పూడి గాంధీ ఈ రోజు మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా ఇంఛార్జి మంత్రి కావడంతో తమ నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరడానికే కలిశామని ఆయా ఎమ్మెల్యేలు పైకి చెబుతున్నా.. అసలు విషయం మాత్రం వేరే అన్న టాక్ నడుస్తోంది.

కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమైన ఈ ఎమ్మెల్యేలు ఈ మేరకు మంత్రిని కలిసి చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకటి లేదా రెండు రోజుల్లో వీరు కాంగ్రెస్ కండువా కప్పునే అవకాశం ఉన్నట్లు గాంధీ భవన్ లో గుస గుసలు వినిపిస్తున్నాయి. గురువారం రాత్రి బీఆర్ఎస్ కు చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం గద్వాల ఎమ్మెల్యే సైతం కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. ఈ క్రమంలో గ్రేటర్ ఎమ్మెల్యేలు సైతం త్వరలోనే హస్తం పార్టీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు