Graying Hair Tips : మీ తెల్లజుట్టు నల్లగా మారటానికి చిట్కాలు!

ఈ రోజుల్లో ఉద్యోగంలో ఉండే ఒత్తిడి వల్లో కుటుంబ బాధ్యతల వల్ల చాలా మందికి చిన్న వయసులోనే తెల్ల జుట్టు వచ్చేస్తుంది.అయితే మేము ఇక్కడ చెప్పబోయే కొన్ని చిట్కాల వల్ల మీ తెల్లజుట్టు నల్లగా మారిపోతుంది. అదేంటో తెలియాలంటే చదివేయండి!

New Update
Graying Hair Tips : మీ తెల్లజుట్టు నల్లగా మారటానికి చిట్కాలు!

Graying Hair In Early Age : చిన్న వయసులోనే జుట్టు తెల్లబడడానికి(Graying Hair) అనేక కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా, జన్యుపరమైనవి, సరైన డైట్(Diet) ఫాలో అవ్వకపోవడం, ఒత్తిడి(Stress), ఇలా చాలా కారణాలున్నాయి. ఈ సమస్యకి ఇంటి చిట్కాలు(Home Tips) తెలుసుకోండి. హెయిర్‌ని తగ్గించుకోవాలంటే ముందుగా డైట్ మెంటెయిన్ చేయాలి. ప్రోటీన్స్, జింక్ సహా పోషకాలు ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవాలి. ఆయిల్ మసాజ్ ముఖ్యం.తక్కువ కెమికల్స్ హెయిర్ ప్రోడక్ట్స్ వాడండి.ఆయుర్వేద మూలికలు వాడొచ్చు.

నువ్వుల నూనెలో శరీరానికి అవసరమైన మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఐరన్ కూడా ఉంటుంది. దీనిని గోరువెచ్చగా చేసి తలకి అప్లై చేసి మసాజ్ చేస్తే శరీరంలోని వేడి తగ్గి జుట్టు నెరసిపోకుండా ఉంటుంది. దీని వల్ల జుట్టుని నల్లగా మారుస్తుంది. కొబ్బరినూనె రాయడం వల్ల కూడా జుట్టుకి పోషణ అందుతుంది. తలకి రక్త ప్రసరణ పెరుగుతుంది. ఈ కొబ్బరినూనెలో నిమ్మరసం కలిపి జుట్టుకి రాసి అరగంట తర్వాత తలస్నానం చేయండి.

తెల్ల జుట్టుని తగ్గించేందుకు హెన్నా(Henna) వాడొచ్చు. ఇందుకోసం టీ డికాషన్‌లో హెన్నా కలిపి 8 గంటలు నానబెడితే తలకి రాస్తే శరీరంలో వేడి తగ్గుతుంది. దీంతో క్రమంగా తెల్లజుట్టు నల్లగా మారుతుంది.జుట్టు తెల్లబడడానికి ముఖ్య కారణం శరీరంలోని వేడ. ఈ వేపని వాడడం వల్ల చుట్టు, జుట్టు సమస్యల్ని తగ్గిస్తుంది. వేపాకులన్ని గ్రైండ్ చేసి హెయిర్ ప్యాక్‌ని వాడండి.అశ్వగంధని కూడా మూలికల రాజుల అంటారు. దీనిని అప్లై చేస్తే జుట్టు నెరసిపోకుండా ఉంటుంది. దీనిని నానబెట్టి జుట్టుకి అప్లై చేయొచ్చు.

కరివేపాకులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఐరన్, జింక్, మాంగనీస్ వంటి పోషకాలు ఉంటాయి. ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజూ ఉదయం 10 కరివేపాకులని నమలడం, కరివేపాకులని మెత్తగా నూరి పౌడర్, పేస్టులా చేసి తలస్నానం చేసిన తర్వాత హెయిర్ ప్యాక్ వేసుకుంటే జుట్టు నెరవకుండా ఉంటుంది.

Also Read : పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్!

Advertisment
తాజా కథనాలు