అంతర్జాతీయ క్రికెట్ లో 66 ఏళ్ల బామ్మ..! లండన్ కు చెందిన ఓ 66 ఏళ్ల ‘సాలీ బార్టన్’ అద్భుతం సృష్టించింది. ముగ్గురు మనువరాళ్లు ఉన్న ఈ బామ్మ క్రికెట్‌లో మొదటి అడుగు వేసింది. పెద్ద వయస్సులో అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేసి రికార్డ్ సృష్టించింది. By Durga Rao 25 May 2024 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి ఏదన్నా నేర్చుకోవడానికి వయసుతోపని లేదు. ఆడ, మగ అనే విషయం ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ నేర్చుకున్న విద్యతో అంతర్జాతీయ జట్టులో చోటు సంపాదించుకోవటం మాత్రం కష్ట సాధ్యం. లండన్ కు చెందిన ఓ 66 ఏళ్ల ‘సాలీ బార్టన్’ అద్భుతం సృష్టించింది. ముగ్గురు మనువరాళ్లు ఉన్న ఈ బామ్మ క్రికెట్‌లో మొదటి అడుగు వేసింది. పెద్ద వయస్సులో అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేసి రికార్డ్ సృష్టించింది. మే నెలలో బార్టన్ గిబ్రాల్టర్ జట్టు తరఫున బార్టన్ ఎస్టోనియాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆడింది. అప్పుడు బార్టన్ వయసు 66 ఏళ్ల 334 రోజులు. గతంలో ఈ రికార్డు పోర్చుగల్ దేశానికి చెందిన అక్బర్ సయ్యద్ పేరు మీద ఉండేది. 2012సంవత్సరంలో 66 ఏండ్ల 12 రోజుల వయసులో క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఇప్పుడు సాలీ బార్టన్ ఆ రికార్డ్ బ్రేక్ చేసింది. అయితే పాపం సాలీ బార్టన్ కు ఈ మ్యాచ్లో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. బౌలింగ్ చేసినా ఎవరినీ అవుట్ చేయలేకపోయింది. అయినాసరే తన వయసుతో ఓ రికార్డ్ బ్రేక్ చేసింది. అయినప్పటికీ ఇతర ఆటగాళ్ళంతా విజృంభిండంతో గిజ్రాల్ట్ జట్టు 3-0తో సిరీస్ కైవసం చేసుకుంది. బార్టన్ లండన్ ఎకనామిక్స్ స్కూల్లో మ్యాథమాటిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేసి పదవీ విరమణ చేసింది. తరువాత క్రికెట్ ఆడటం మొదలుపెట్టింది. కొత్త విద్యను నేర్చుకోవటానికి వయసుతో సంబంధం లేదని మరోసారు రుజువు చేసింది. #international-cricket #oldest-international-cricketer మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి