Siddhartha wedding: ఘనంగా బ్రహ్మనందం కొడుకు వివాహ వేడుకలు

హాస్య బ్రహ్మ, తనదైన నటనతో వెయ్యికిపైగా చిత్రాల్లో భారతీయ ప్రేక్షకులకు వినోదం అందించిన నటుడు బ్రహ్మానందం. ఆయన ద్వితీయ కుమారుడు సిద్ధార్థ ఏడు అడుగులు వేశారు. శ్రీ బూర వినయ్ కుమార్, పద్మజ దంపతుల పుత్రిక ఐశ్వర్య మెడలో సిద్ధార్థ మూడు ముడులు వేశారు.

New Update
Siddhartha wedding: ఘనంగా బ్రహ్మనందం కొడుకు వివాహ వేడుకలు

అంగరంగ వైభవంగా..

సిద్ధార్థ, ఐశ్వర్యల వివాహం శుక్రవారం (ఆగస్టు 18) రాత్రి 10.45 గంటలకు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నందు గల అన్వయ కన్వెన్షన్స్‌లో జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, సీఎం కేసీఆర్, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, గంగుల కమలాకర్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు హారైయ్యారు.

Grand wedding of Brahmanandam son

హాజరైన ప్రముఖులు

తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి నందమూరి బాలకృష్ణ, మంచు మోహన్‌బాబు, మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్, కోట శ్రీనివాసరావు, రాజశేఖర్ జీవిత దంపతులు, రామ్ చరణ్ ఉపాసన దంపతులకు పాటు చిరంజీవి సతీమణి సురేఖ, పెద్దమ్మాయి సుష్మిత, శ్రీకాంత్ ఫ్యామిలీ, సాయి కుమార్ ఫ్యామిలీ, మంచు విష్ణు దంపతులు, మంచు మనోజ్ దంపతులు, దర్శకులు కోదండరామిరెడ్డి, ఎస్వీ కృష్ణారెడ్డి, త్రివిక్రమ్ శ్రీనివాస్, శేఖర్ కమ్ముల, నటులు రావు రమేష్, ఆలీ ఫ్యామిలీ, ఎల్బీ శ్రీరామ్, నిర్మాతలు శివలెంక కృష్ణ ప్రసాద్, బెల్లంకొండ సురేష్, అచ్చిరెడ్డి, ఆదిశేషగిరిరావు, కేఎల్ నారాయణ, రఘుబాబు తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Grand wedding of Brahmanandam son

సినిమాలకు దూరం..

బ్రహ్మానందానికి ఇద్దరు కుమారులున్న విషయం తెలిసిందే. అయితే పెద్ద కుమారుడు గౌతమ్ కొన్ని సినిమాలలో చేశారు. ప్రస్తుతం బిజినెస్ పనులు చూసుకుంటున్నారు. రెండో కొడుకు మాత్రం సిద్ధార్థ గురించి చాలా తక్కువ మందికి తెలుసనే చెప్పాలి. అయితే విదేశాల్లో చదువుకుంటున్న సిద్ధార్థ సినిమాల వైపుకు చాలా దూరంగా ఉన్నారు. అయితే సిద్ధార్థ విదేశాల్లోనే చదువుకొని అక్కడే స్థిరపడి స్థిరపడినట్లు తెలుస్తోంది. సాంప్రదాయ పద్ధతిలో పెద్దలు కుదిరించిన పెళ్లితో తాజాగా సిద్ధార్థ-ఐశ్వర్య ఒకటైయ్యారు.

Grand wedding of Brahmanandam son

Advertisment
తాజా కథనాలు